kodanda raam
-
TJS ను ఏ పార్టీలోనూ విలీనం చెయ్యట్లేదు : ప్రొ : కోదండరాం
-
స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న టీజేఎస్
సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వీలై నన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు తెలంగాణ జనసమితి (టీజేఎస్) కసరత్తు ప్రారంభించింది. పోటీ చేయాల్సిన స్థానాలపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. పార్టీ బలంగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి, మండలాల వారీగా పార్టీ శ్రేణుల బలాబలాలను బట్టి పోటీకి సిద్ధం చేయాలని భావిస్తోంది. జిల్లాల సన్నాహకాల సమావేశాలకు శ్రీకారం చుట్టింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం జరిగిన పరిషత్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కోదండరాం పలు అంశాల పై చర్చించారు. పార్టీ తరఫున ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా విశ్వేశ్వర్రావు వ్యవహరించనుండగా, ఆ పార్టీ నేతలు రమేష్‌రెడ్డి, పాండురంగారావు, గోపాల్‌శర్మ, జగ్గారెడ్డి, అంబటి శ్రీనివాస్, శ్రీశైల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వెదిరె యోగేశ్వర్‌రెడ్డి, అవినాశ్ మాలవ్యలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సోమవారం సమావేశం కానున్నట్లు తెలిసింది. -
‘తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించండి’
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను అఖిల పక్షం నేతలు మంగళవారం కలిశారు. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌ను కొనసాగించొద్దని కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ పార్టీల నాయకులు గవర్నర్‌ను కోరారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర పతి పాలన విధించాలని గవర్నర్‌ను విపక్షాలు కోరాయి. రాజీవ్ శర్మ బ్రోకరా? : ఉత్తమ్ కుమార్ రెడ్డి మోదీ, కేసీఆర్, ఎన్నికల కమిషన్ కలిసి తెలంగాణ ప్రజల హక్కును కాలరాసేలా నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎలా జరగాలో కూడా కేసీఆర్ ముందే షెడ్యూల్ విడుదల చేశారన్నారు. ఓటర్ లిస్టులో 20 లక్షల ఓట్లు తగ్గించి వాటిని సవరించకుండా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. 6న గవర్నర్‌ను కలిసిన తరువాత కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాను అని చెప్పారని, ఆన్ రికార్డ్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో కూడా మాట్లాడానని చెప్పారన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున రాజీవ్ శర్మ ఎన్నికల కమిషన్‌ను ఎలా కలుస్తారు, ఆయన ఏమైనా బ్రోకరా అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం : కోదండ రామ్ ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని గవర్నర్‌ను కలిశామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్ అన్నారు. ఓటర్ల పేర్లు ఓటర్ లిస్ట్‌లో గల్లంతయ్యాయన్నారు. వినాయక చవితి, దసరా పండుగలలో ప్రజలు బిజీగా ఉంటారు అందువల్ల ఓటరు నమోదు కార్యక్రమం సరిగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా కేసీఆర్ పాలన : ఎల్ రమణ తెలంగాణలోని రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని టీటీడీపీ అధ్యక్ష్యుడు ఎల్ రమణ అన్నారు. ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని కేసీఆర్ చెప్పడం చూస్తే కేంద్రంతో కుమ్మక్కై,రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. సచివాలయానికి రాకుండా పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీజేఎస్, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలు కలిసి రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతి పాలనను విధించమని కోరుతామని పేర్కొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగడానికి వీలు లేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణలో పాలన : చాడ వెంకట్ రెడ్డి తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి 100 సీట్లు గెలుస్తామంటున్నారని, మోదీతో కలిసి ఎన్నికల షెడ్యూల్ కూడా కేసీఆర్ ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. రేపు కేసీఆర్ తను అనుకున్నది చేయడానికి ఎంతమంది పైన కేసులు పెట్టడానికైనా వెనకాడరన్నారు. కేసీఆర్‌పై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఏమాత్రం స్పందించలేదన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. నవంబర్‌లో ఎన్నికలు రావడానికి అనేక అక్రమాలు చేస్తున్నారని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకునేలా కూడా ఆలోచిస్తామన్నారు. -
భూమిపై హక్కు కోసమే దీక్ష
సాక్షి, మహబూబాబాద్ : ప్రతి రైతుకు పాస్బుక్కు, పంట చెక్కు, భూమి మీద హక్కు కోసమే రైతు దీక్ష చేపట్టినట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మానుకోట పట్టణంలో సోమవారం టీజేఎస్ ఆధ్వర్యంలో వివేకానంద సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేపట్టిన రైతు దీక్షలో కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమంలో వాస్తవ సాగుదారులకు అన్యాయం జరిగిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళన చరిత్రలో ఇంతకు ముందెన్నప్పుడూ జరగని పనిగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, కానీ క్షేత్రస్థాయిలో టీజేఎస్ పరిశీలనలో భూప్రక్షాళన మరిన్ని సమస్యలు సృష్టించి, రైతులను మరింత గందరగోళంలోకి నెట్టిందన్నారు. తమకు రెవెన్యూ అధికారులతో ఎలాంటి గొడవలేదని, గొడవంతా ప్రభుత్వం మీదనేన్నారు. లక్షల కొద్ది రికార్డుల్లో తప్పులు దొర్లడం, వాటి ప్రకారమే రైతుబంధు చెక్కులివ్వటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పాస్‌పుస్తకాల పంపిణీలో మొదటి రోజే 3,07,640 పుస్తకాల్లో తప్పులు దొర్లాయని గుర్తించి వాటిని పంపిణీ చేయకుండా వెనక్కి పంపారన్నారు. ఇక పంపిణీ చేసిన వాటిలో 9,11,241 తప్పులు దొర్లినట్లు అధికారికంగా గుర్తించారని తెలిపారు. ఇవేగాక వివిధ కారణాల రీత్యా అసలు పంపిణీకి నోచుకోనివి 7,39,680 పాస్ పుస్తకాలు ఉన్నాయన్నా రు. తప్పులు పడిన రికార్డులను సరి చేయించుకోడానికి రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తుందన్నారు. తమ భూమి తమకు కాకుండా పోతుందేమోననే ఆందోళనతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి వెబ్సైట్లో సాంకేతిక లోపాలు ఉండడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక పక్క వర్షాలు పడుతుంటే, వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. ‘నీ చెక్కులు వద్దు.. మా భూమి మాకుంటే చాలు, రికార్డులు సరి చేసి మా పాస్ బుక్కులు మాకిస్తే చాలు’ అనే స్థితికి రైతులు వచ్చారన్నారు. భూమి వెట్టి నుంచి విముక్తి చేసి, రైతు ఆత్మగౌరవంతో జీవించేలా చేసిందన్నారు. ఇప్పుడు భూప్రక్షాళనలో పేదల భూములపై కాస్త బడా రైతుల పేర్లతో పాస్ పుస్తకాలు రావడంతో ఆందోళనకు గురవుతున్నారని కోదండరాం అన్నా రు. ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల మీద దాడులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తప్పులను సరిచేసి రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని మానుకోట టీజేఎస్ సమన్వయకర్త డోలి సత్యనారాయణ అన్నారు. పోడు రైతులకు టీజేఎస్ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం సాక్షర భారత్ దీక్షా స్థలాన్ని సందర్శించిన కోదండరాం వారికి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లాకార్యదర్శి సాదుల శ్రీనివాస్, సీపీఐ జిల్లాకార్యదర్శి విజయసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షులు రాంచంద్రునాయక్, టీడీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు సునీత, టీజేఎస్ నాయకులు పిల్లి సుధాకర్, భూక్యా సత్యనారాయణ, నారాయణసింగ్, మనోజ్, మాలోతు వెంకన్న, శశికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
'కేసు మాఫీ కోసమే గవర్నర్‌పై ఆరోపణలు'
రంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే సెక్షన్-8 వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్-8లో అభ్యంతరకర రీతిలో అధికారాలను పొందు పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని, పరిస్థితి దిగజారితే గవర్నర్ నరసింహన్ తన విచక్షణాధికారాలను వినియోగించుకోవచ్చని అన్నారు. కేసు మాఫీ కోసమే చంద్రబాబు.. గవర్నర్ సరిగా పనిచేయడంలేదని విమర్శలు చేస్తున్నాడన్నారు. కేంద్రం సెక్షన్-8 అమలుకు ప్రయత్నిస్తే జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. -
కూనపురి రాములు పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ: మాజీ మావోయిస్టు కూనపురి రాములు ప్రథమ వర్ధంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 11న నల్గొండ జిల్లా దాసిరెడ్డిగూడెంలో రాములు వర్ధంతి వేడుకలను నిర్వహించనున్నారు. అదే రోజున స్థూపం ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.