'కేసు మాఫీ కోసమే గవర్నర్‌పై ఆరోపణలు' | chabndra babu allages governer only to take back step on vote for note says kodanda raam | Sakshi
Sakshi News home page

'కేసు మాఫీ కోసమే గవర్నర్‌పై ఆరోపణలు'

Published Wed, Jul 1 2015 7:17 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

chabndra babu allages governer only to take back step on vote for note says kodanda raam

రంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే సెక్షన్-8 వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్-8లో అభ్యంతరకర రీతిలో అధికారాలను పొందు పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని, పరిస్థితి దిగజారితే గవర్నర్ నరసింహన్ తన విచక్షణాధికారాలను వినియోగించుకోవచ్చని అన్నారు. కేసు మాఫీ కోసమే చంద్రబాబు.. గవర్నర్ సరిగా పనిచేయడంలేదని విమర్శలు చేస్తున్నాడన్నారు. కేంద్రం సెక్షన్-8 అమలుకు ప్రయత్నిస్తే జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement