హక్కుల పోరాటయోధుడు
ఆయన మట్టి పరిమళాలు తెలిసిన వారే. స్వాతంత్య్రానంతరం తొలి తరం ప్రతినిధి. కొద్దిపాటి భూమితో గంపెడు సంసారాన్ని ఈదే నిరుపేద రైతు కుటుంబంలో పుట్టారు. ఆర్థిక, సామాజిక వెనుకుబాటుతనాన్ని చవిచూశాడు. కష్టపడి చదువుకున్నాడు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సామాజికశాస్త్ర ఆచార్యులుగా ఎదిగారు. పాతికేళ్ల క్రితమే దళితుల మీద అగ్రవర్ణాల దాడిని చూసి చలించిపోయి, తన పేరు చివరన ఉన్న కులాధిపత్య చిహ్నాన్ని తొలగించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ గా ప్రొఫెసర్ కోదండరాం పేరు తెలియనివారుండరు. తెలంగాణ ఉద్యమ ఎజెండాతో మొదలై ప్రస్తుత రాజకీయ ఉద్యమం వరకు సాగిన యాత్రలో ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం, విరమించుకోవడం రెండూ జరిగిపోయాయి. అయితే, ఆ విరమణకు కారణంగా ఆయన లక్ష్యసాధన ప్రధాన అంశంగా చెబుతారు.
పేరు : ముద్దసాని కోదండరాం
తల్లిదండ్రులు : జనార్దన్‌రెడ్డి, వెంకటమ్మ
పుట్టిన తేదీ : సెప్టెంబర్ 5, 1955
ఊరు : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలోని జోగాపూర్. తండ్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు.
నేపథ్యం : తండ్రి వ్యవసాయదారు. అయిదుగురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు
కుటుంబం : 1983 లో నిజామాబాద్‌కు చెందిన సుశీలతో వివాహం. అమె డిగ్రీ వరకు చదివారు. గృహిణిగా ఉన్నారు. కూతురు మైత్రి, కుమారుడు చేతన్ ఇంజనీరింగ్ పూర్తిచేసి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరారు.
చదువు : ప్రాథమిక విద్య వరంగల్
► డిగ్రీ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ
► ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయం
► ఎంఫిల్ (చైనా అధ్యయనం) జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ
► పీహెచ్‌డి (తెలంగాణ మారుతున్న ఆధిపత్య సంబంధాలు) హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి
► వృత్తి : రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు
► 1981 నుంచి పదేళ్లు నిజాం కాలేజి
► 1991 నుంచి పదేళ్లు కోఠి ఉమెన్స్ కళాశాల
► 2001 నుంచి మూడేళ్లు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆచార్యుడిగా, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఆచార్యుడిగా పనిచేశారు.
రచనలు
1) మూడు దశాబ్దాల ‘నక్సల్బరీ ఉద్యమం - గమ్యం గమనం’ సంపుటిలో ఒక వ్యాసం
2) ‘తెలంగాణ ముచ్చట’ వ్యాస సంపుటి
3) ‘స్వేచ్చ’ పత్రికకు 1984 నుంచి 1998 వరకు సంపాదకుడు
4) వివిధ పత్రికలకు 25 పైగా వ్యాసాలు
ఉద్యమ నేపథ్యం : పాతికేళ్ల ఉద్యమ జీవితం
► తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనరు.
► తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు, దానికి కన్వీనర్ గా కొనసాగుతున్నారు.
► కమ్యూనిస్టు, హేతువాది, పౌర హక్కుల ఉద్యమకారుడు. నెల జీతంలో సగానికిపైగా పేద విద్యార్థుల ఫీజులకు కేటాయిస్తారు.
► గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం, వారి ఆకలిదప్పులు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం
విద్యార్ధి దశలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం
► 1981 లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల వేదిక(ఏసీసీఎల్‌సీ) సభ్యుడు
► 1985 లో కాంచేడులో దళితులపై దమన కాండకు చలించి కులాన్ని సూచించే విధంగా ఉన్న ‘రెడ్డి’ని తన పేరులోంచి తొలగించారు.
►‘1983-99 ఏసీసీఎల్సీ నగర్ కమిటీలో ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
►1999 లో బాలగోపాల్, జీవన్ కుమార్‌లతో కలిసి మానవ హక్కుల పై పోరాటం
►1989 నుంచి తెలంగాణ వెనుకబాటుతనంపై పోరాటం
► 1998-99 లో రాష్ట్రంలో ఆత్మహత్యలు, ఆకలిచావులు, కరువు, ఆదివాసీల ఆహార సమస్యపై ఆధ్యయనం
► 2001-04 మద్య తెలంగాణ ఐక్య వేదిక ద్వారా ఉద్యమం
► 2004 లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు, అధ్యక్ష బాధ్యతలు
► 2018 లో తెలంగాణ జన సమితి ఏర్పాటు
అధికారిక బాధ్యతలు : 2002లో ఆహార హక్కు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన కమిషన్‌కు రాష్ట్ర సలహాదారుగా విధులు
Comments
Please login to add a commentAdd a comment