
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను టీఆర్‌ఎస్ ఎన్ని రకాలుగా వంచించిందో, అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వివిధ వర్గాల కు చెందిన పలువురు నేతలు మంగళవారం టీజేఎస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీజేఎస్ కండువాలను కప్పి కోదండరాం వారిని పార్టీలోకి ఆహ్వానిం చారు.
ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చి, అధి కారంలోకి వచ్చాక నమ్మిన ప్రజలను కేసీఆర్ వంచించారని మండిపడ్డారు. యువకులను, రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను కేసీఆర్ వంచించారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పతనం తప్పదని జోస్యం చెప్పారు. టీజేఎస్‌లో చేరిన వారిలో తెలంగాణ పరిరక్షణ సమితి అధ్య క్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మైనారిటీ నేతలు మహ్మద్ అబ్దుల్ తదితరులు ఉన్నారు.
మహిళా విభాగం అధ్యక్షురాలిగా లక్ష్మి
టీజేఎస్ మహిళా విభాగం కన్వీనర్‌గా రేగులపల్లి లక్ష్మిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా విభాగం సమన్వయకర్తగా వీణా మమత, కో కన్వీనర్లుగా ఎన్.సక్కుబాయి, బి.అనంతలక్ష్మి, అరికెల్ల స్రవంతి, టి.విజయరాణి, మేకల రజని, స్వర్ణలత, జయశ్రీని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment