
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి అధికారంలోకి వస్తే.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు కనీస ఉమ్మడి ప్రణాళికలో చోటు కల్పిస్తామని, అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని మహాకూటమి నేతలు హామీ ఇచ్చా రు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ‘ఆర్టీసీ పరిరక్షణ– కార్మికుల హక్కుల పరిరక్షణ’ సదస్సు జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ నియం త సీఎం కేసీఆర్‌ను కూల్చేందుకే తాము మహాకూటమిగా జతకట్టామన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు వారిని పట్టిం చుకోకపోవడం ఆయన నియంతృత్వానికి నిదర్శమ ని మండిపడ్డారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను బూతులు తిడుతున్నాడని దుయ్యబట్టారు. కొత్త బస్సుల కొనుగోళ్లు, అద్దె బస్సుల రద్దు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలను ఉమ్మ డి కనీస ప్రణాళికలో పెట్టి, మేనిఫెస్టోలో చోటు కల్పి స్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌కో హఠావో.. తెలం గాణ బచావో అన్న నినాదంతో టీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏర్పడిన రాజకీయ విపత్తును ఎదుర్కొనేందుకే మహా కూటమి ఆవిర్భవించిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు.
సీఎం ఫిట్‌నెస్ లేని డ్రైవర్..
తెలంగాణ రాష్ట్రమనే బస్సును సీఎం కేసీఆర్ డ్రైవర్‌కు అప్పగిస్తే.. పరిపాలన చేతగాక స్టీరింగ్ వదిలేశాడని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కేసీఆర్ పరిపాలన ఫిట్‌నెస్ కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల వేతన త్యాగం, పోరాటాలతో సీఎం అయిన కేసీఆర్ వారిని విస్మరించడం దారుణమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రాజిరెడ్డి, నరసింహన్, బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment