
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ హామీలు నెరవేరాలంటే దక్షిణ భారత దేశ రాష్ట్రాల బడ్జెట్‌లు సరిపోవని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఆర్యవైశ్య సంఘం నేతలు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆర్యవైశ్య సంఘం నేతలకు కండువా కప్పి మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టీడీపీ కాంగ్రెస్ తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. 2014నుంచి కోదండరామ్ కాంగ్రెస్ వాదిగా మారాడన్నారు. తెలంగాణ ప్రజల చావులకు కారణమైన పార్టీలతో కోదండరామ్ పొత్తుపెట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే ఢిల్లీకి పోతుందని కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కచ్చితంగా 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment