
సాక్షి, హైదరాబాద్: మహా కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసేందుకు కామన్ మినిమం ప్రోగ్రాం(సీఎంపీ)ని రూపొందించుకోవాలని, దీనికి మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ అంగీకరించాలని టీజేఎస్ షరతు విధించింది. మహాకూటమి ప్రభుత్వం ఏర్పడితే సీఎంపీని అసెంబ్లీలో ప్రత్యేక కౌన్సిల్‌గా మార్చి చట్టబద్ధత కల్పించి దానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను చైర్మన్‌గా చేయా లని టీజేఎస్ కోరింది.
మహాకూటమిలో చేరితే అమలుచేయాల్సిన అంశాలపై కోదండరాం అధ్యక్షతన సమావేశమై నిర్ణయించిన షరతులను శుక్రవారం ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది. ప్రభుత్వ పాలన తెలంగాణ అవసరాల కోసమే సాగాలని, ఉద్యమ ఆకాంక్షలకు పెద్దపీట వేయాలని కోరారు. ఆంధ్రా పెట్టుబడిదారులకు తెలంగాణలో మళ్లీ స్థానం కల్పించొద్దని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓట్లు, సీట్ల కంటే ఉద్యమ ఆకాంక్షల సాధనే టీజేఎస్‌కు ముఖ్యమ న్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలకుడు కేసీఆర్‌ను గద్దెదించడానికి అంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలన్నారు. సీఎంపీ కోసం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు సిద్ధమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment