రాష్ట్రంలో నిరంకుశ పాలన | Kodandaram Slams CM KCR Governance At Karimnagar | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నిరంకుశ పాలన

Published Tue, Aug 14 2018 12:37 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Kodandaram Slams CM KCR Governance At Karimnagar - Sakshi

ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని తెలంగాణ టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకుంటున్నారని తెలిపారు. సోమవారం కరీంనగర్‌ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు కపిల్‌వాయి దిలీప్‌కుమార్, గాదె ఇన్నయ్య తదితరులతో కలిసి మాట్లాడారు. కరీంనగర్‌ నగరంలో సీఎం కేసీఆర్‌ మొక్క నాటితే దాన్ని కాపాడేందుకు ఇద్దరు పోలీసులు, ఇద్దరు మున్సిపల్‌ ఉద్యోగులను పెట్టి, నీళ్లు పోసేందుకు వాటర్‌ ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారని, మొక్కకు అంత రక్షణ తీసుకున్నప్పుడు రైతులు కూడా తమ చేనుచెలుకను కాపాడుకోవడానికి అంతే తాపత్రయ పడుతారనే విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. పంటలు వేసుకునే సమయంలో నీళ్లివ్వమంటే ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు.

ప్రస్తుతం వానలు పడుతున్నయ్, వరదలు వస్తున్నయ్, ప్రభుత్వం కొద్దిగా ఆలోచించి అప్పుడే అర టీఎంసీ నీటిని వదిలి ఉంటే ఇంత ఘర్షణకు అవకాశం ఉండేది కాదని వివరించారు. కరీంనగర్‌ నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల స్థలంలో ఒక భాగం పురాతన కట్టడంగా ఉన్న దాన్ని కాపాడుకోగలిగాం కానీ, ఇంకా ఆర్ట్స్‌ కళాశాలకు సంబంధించిన జాగలో ఇక్కడున్న నాయకులు సినిమా థియేటర్ల కోసం, మల్టిఫ్లెక్స్‌ల కోసమో దాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితేనన్నారు. ఎవరో దాత విద్యాసంస్థలు నడపమని ఇస్తే, రాజకీయ నాయకులు విద్యాసంస్థలను పెంపు చేయకుండా ఉన్నజాగను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, వినోద్‌రావు, శ్రీనివాస్‌రావు కోసం ఈ కుట్ర జరుగుతోందని, నిరంకుశులు అనుకునేటోళ్లు అట్ల వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది నీచ రాజకీయాలకు అద్దంపట్టి చూపుతోందన్నారు.  ప్రజలకోసం ఉపయోగపడాల్సిన అధికారం, నగరం, నీళ్లు మాకోసమనే పద్ధతుల్లో అధికారాన్ని చలాయిస్తున్నారని విమర్శించారు.

రేపు ఆర్ట్స్‌ కళాశాల జాగాతో ఆగుతరనే నమ్మకం లేదని, పక్కన బస్‌ డిపో కూడా ఇక్కడ ఎందుకండి మానేరు కాడా జాగలో పెట్టుకోండని పంపించినా పంపించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాలేజీలు ఊరవతల ఉండాలి, మీ థియేటర్లయితే నడుమ కట్టుకోవాలా..? అని ప్రశ్నించారు. ఇవాళ్ల ఇలాంటి పరిస్థితులు కరీంనగర్‌ నడిబొడ్డున సాక్షాత్కరిస్తున్నదన్నారు. ఇదే జిల్లాలో నీళ్ల కోసం ఆరాటపడుతున్న రైతుల విషయంలో ప్రభుత్వ అనుసరించిన వైఖరి కూడా సాక్ష్యంగానే కనబడుతోందన్నారు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. కొత్త తరహా రాజకీయాలు కావాలని అన్నారు. 1990కంటే ముందుకు ఇదే జిల్లాలో రాజకీయాలు చేసిన ఎంతోమంది సోషలిస్టులు పోరాటం చేసి ఉన్న ఆస్తులన్నీ ప్రజల కోసం కరగదీసిన దాఖలాలూ ఉన్నాయన్నారు. కానీ ఇవాళ్లి రాజకీయాల్లో గుప్పెడు మంది తెలంగాణ తమ సొంత ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

సమాజం కోసం ఎలా పనిచేయాలో చెప్పేదే రాజకీయమని, రాజకీయాలు అవి సరిగా నడవకపోతే కొట్లాడి తెచ్చిన తెలంగాణకు అర్థం లేదన్నారు. వాటిని మార్చడానికి జనసమితి సమస్యల ప్రాతిపదికన ప్రజలను సమీకరిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాది వేయాలనేది తమ తాపత్రయమన్నారు. చాలా అనుభవాలను సమీక్షించుకున్నామని తెలి పారు.  గన్‌పార్కులో ఉన్న అమరుల స్తూపం మా దిరిగా మరో స్థూపానికి రూపకల్పన చేస్తున్నామ ని తెలిపారు. మనం కొట్టాడిన తెలంగాణ మన ఆ కాంక్షల పునాదిగా నిర్మించుకుందామని పిలుపుని చ్చారు. సమావేశంలో తెలంగాణ జన సమితి జి ల్లా కన్వీనర్‌ ముక్కెర రాజు, నరహరి జగ్గారెడ్డి, రొ ంటాల కేశవరెడ్డి, బి.వెంకటమల్లయ్య, మహిపాల్‌రెడ్డి, గడ్డం రవీందర్‌రెడ్డి, వరాల శ్రీనివాస్, మొ గురం రమేశ్, మాధవి తదితరులు పాల్గొన్నారు.  
ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement