సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ ఢిల్లీలో వరుస సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. టీజేఎస్ పార్టీ స్థాపించిన అనంతరం తొలి సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కోదండరామ్ జాతీయ నేతలతో భేటీ అవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి రచించిన ‘టెన్ ఐడియాలజీస్: ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన కోదండరామ్ గురువారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను కోదండరామ్ వివరించారు. టీజేఎస్ భవిష్యత్ కార్యచరణ, రానున్న ఎన్నికలో తమ పార్టీ అనుసరించనున్న వ్యూహాల గురించి కేజ్రీవాల్‌తో చర్చించారు. ఈ సమావేశంలో కోదండరామ్‌తో పాటు సౌత్ ఇండియా ఇంచార్జ్ సోమనాథ్ భారతి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment