
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తమకు కేటాయించిన సీట్ల విషయమై మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలు ఇంకా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పార్క్ హయత్ హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన దూత కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉతమ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం భేటీ అయ్యారు.
సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్‌కు, ఇతర భాగస్వామ్య పార్టీలకు కోదండరాం మధ్యవర్తిత్వం నెరుపుతున్నారు. తమకు నాలుగు సీట్లు కేటాయిస్తేనే మహాకూటమిలో కొనసాగుతామని సీపీఐ పట్టుబడుతున్న విషయాన్ని ఆయన ఈ భేటీలో కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది. సీపీఐకు నాలుగు సీట్లు కేటాయిస్తామని హామీ ఇస్తేనే.. ఆ పార్టీ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి పార్క్ హయత్ హోటల్‌కు వస్తారని కాంగ్రెస్ నేతలకు కోదండరాం స్పష్టం చేసినట్టు సమాచారం. అంతకుముందు కోదండరాం.. నగరంలోని ఓ హోటల్‌లో చాడా, టీడీపీ నేత ఎల్ రమణతో భేటీ అయి.. కూటమి సీట్ల పంపకాలపై చర్చించారు.