
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్, ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు ప్రభావాన్ని తమ అభ్యర్థులు తట్టుకోలేకపోయారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండ రాం పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు బాగా పనిచేశారని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారన్నారు.ఎన్నికల్లో వివిధ కారణాలతో వారు గెలుపొందలేకపోయారని చెప్పారు. తమ అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టలేదన్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment