జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్ నేతలకు లేదని టీడీపీ మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం.....
ఆత్మకూరు : జేఏసీ చైర్మన్ కోదండరాంను విమర్శించే స్థాయి టీఆర్‌ఎస్ నేతలకు లేదని టీడీపీ మండల అధ్యక్షుడు ఇర్సడ్ల సదానందం అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కోదండరాంను ఉద్యమ సమయంలో హీరోను చేసి ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసంకాదన్నారు. సకల జనుల సమ్మె ద్వారా అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత కోదండరాందేనన్నారు. ఆయనను చూస్తే టీఆర్‌ఎస్ నేతలకు వణుకు పుడుతుందన్నారు.