'రైతు ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు'
ఢిల్లీ: దేశంలో విదర్భా తర్వాత తెలంగాణలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యలు జరగలేదనడం వాస్తవం లేదని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది 800 మంది రైతులు చనిపోయారని కేంద్రప్రభుత్వం లెక్కలు చెబుతోందని విమర్శించారు.
ఈ అత్మహత్యలన్నింటికి గత ప్రభుత్వాల ప్రభావమే కారణమన్నారు. రైతు ఆత్మహత్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని మండిపడ్డారు. తక్షణమే హైకోర్టు విభజన చేయాలని కేంద్రహోం శాఖ మంత్రిని కోదండరామ్ కోరారు.