ప్రధాన వేదికపై వెయ్యిమంది.. | Telangana Jana Samithi formation meeting | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 29 2018 4:13 PM | Last Updated on Sun, Apr 29 2018 6:27 PM

Telangana Jana Samithi formation meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్‌ స్టేడియంలో జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై వెయ్యిమంది కూర్చునేవిధంగా ఏర్పాటు చేశారు. తొలివరుసలో అన్ని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూర్చోనున్నారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న అమరుల కుటుంబసభ్యులు, బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులు కూడా వేదికపై కూర్చోనున్నారు. ఈ సభలో పార్టీ అధినేత కోదండరాంతోపాటు హరగోపాల్‌, నాగేశ్వర్‌ ప్రసంగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement