
ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఏజెంటేనా?
ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ప్రశ్నించిన వారంతా కాంగ్రెస్ ఏజెంట్లేనా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
కోదండరాం ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ప్రశ్నించిన వారంతా కాంగ్రెస్ ఏజెంట్లేనా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయాన్నే కోదండరాం చెప్పారన్నారు. కోదండరాంపై టీఆర్‌ఎస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే కోదండరాం ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. అర్థంపర్థంలేని ఆరోపణలు, విమర్శలతో మూకుమ్మడి దాడి చేయ డం సరికాదన్నారు. ‘‘ఉద్యమ సమయంలో కోదండరాంను ఉపయోగించుకుని ఇప్పు డు కరివేపాకులా తీసేస్తున్నారు.
ప్రశ్నించిన ప్రతివారినీ కాంగ్రెస్ ఏజెంట్ అనడం దారు ణం. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఓ రాజకీయ దళారి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను టీఆర్‌ఎస్‌లో చేర్చడానికి కమీషన్‌గా ఆయన మంత్రి పదవి తీసుకున్నారు’’ అన్నారు. పార్టీకి వ్యతి రేకంగా పనిచేస్తే ఎవరికైనా ఒకటే న్యాయమని, కోమటిరెడ్డా.. మరొకరా అనేది ముఖ్యం కాదన్నారు. వాటర్ గ్రిడ్‌లో అవినీతిని బయటపెట్టడానికి అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్లు చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లలో 2 లక్షల కోట్ల దోపిడీ చేసేందుకు సీఎం కేసీఆర్ టెండర్ వేశారన్నారు. కేవలం రూ.475 కోట్లు వెచ్చి స్తే ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని, వీటికి నిధులను ఎందుకు కేటాయించడం లేదన్నారు. కొన్నిచోట్ల పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, అలాంటివారిపై కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు.