నిరుద్యోగ ర్యాలీ విజయవంతం అయిందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. ర్యాలీ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, అరెస్టుల పర్వం తదితర అంశాలపై గురువారం ఉదయం ఆయన నివాసంలో జేఏసీ నేతలు, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి నాయకుల మధ్య చర్చల అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా ర్యాలీకి వచ్చారని చెప్పారు. దాదాపు 5వేలమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలుసని, దీన్ని బట్టే ర్యాలీ విజయవంతం అయిందని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.