తొలుత అనుమతి.. తర్వాత నిరాకరణ
కేయూలో చెట్టు కిందే మాట్లాడిన కోదండరాం
కేయూ క్యాంపస్: కాక తీయ యూనివర్సిటీ లో ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనై జేషన్ (ఐఎస్ వో)మ ఆధ్వర్యంలో శని వారం ‘రిజెక్టింగ్ విక్టిమ్ హుడ్, రిక్‌లైమింగ్ డిగ్నిటీ ఆఫ్ అగనెస్ట్ హేట్’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశ నిర్వాహణకు అధికారులు తొలుత అనుమతి ఇచ్చి తర్వాత నిరాకరించారు.
సమావేశానికి వచ్చిన జేఏసీ చైర్మన్ కోదండరాం తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా పలువురు ఆపి ఇక్కడే మాట్లాడాలని పట్టుబట్టారు. ఆయనను చెట్టు కిందకు తీసుకొచ్చి గొడుగు పట్టారు. అందరికీ సమాన విలువలు అందించేలా రాజ్యాంగాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఉందని కోదండరాం అన్నారు. హ్యూమన్ డిగ్నిటీపై చర్చిం చేందుకు అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు.