బహిరంగ సభలో మాట్లాడుతున్న టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి(టీజేఎస్) లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కేయూ క్యాంపస్: పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి (టీజేఎస్) లక్ష్యమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నా రు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్‌లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోనే డిగ్రీ చదువుకున్నానని, ఇక్కడ అప్పట్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలతో చర్చలు జరిగేవని, పోరా టాలగడ్డ వరంగల్‌లో కాళోజీ స్వాగతం పలికేవారని గుర్తుచేసుకున్నారు. ఆచార్య జయశంకర్, బియ్యాల జనార్దన్‌రావు, భూపతి కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి నాంది వరంగల్‌లోనే జరిగిందని అన్నారు.
కేసీఆర్ ఏం చేశాడు ?
ఎంతోమంది యువత ఆత్మబలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణాలో గద్దెనెక్కిన కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి? తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ఉన్న ఇళ్లను కూలగొట్టగా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను ఎత్తివేశారని తెలిపారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని అక్కడ ధర్నాకు ఉపక్రమించితే వారిని బలవంతంగా అరెస్ట్ చేయించారన్నారు. అప్రజాస్వామికంగా నియంతృత్వ పోకడలతో వ్యవహరించారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా కుర్చీలో కూర్చుంటే అడిగే హక్కు వారికి ఉందన్నారు.
తెలంగాణకు ఆదాయం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేశారని అన్నారు. టీఆర్‌ఎస్ ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తోందని, మద్యం సీసాలు కూడా పంచుతున్నారంటా.. ఇదేం ప్రచారమని ప్రశ్నించారు. అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి టీజేఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీజేఎస్ రాష్ట్ర బాధ్యుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ అప్రజాస్వామిక పాలన చేశారని, కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చలేదని విమర్శించారు. టీజేఎస్ రాష్ట్ర నాయకుడు భద్రోద్రి మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్లు కేటాయించామని చెప్పారు కానీ రూ.200కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు. సమావేశంలో టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, రాజేంద్రప్రసాద్, శ్యాం సుందర్‌రెడ్డి, బొట్ల బిక్షపతి, మంద భాస్కర్, డాక్టర్ తిరుణహరిశేషు, పులిసత్యం, జి.రవీందర్, శైలేందర్‌రెడ్డి, డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, పులి సత్యం, రాజేందర్, వినయ్‌కుమార్, లక్ష్మి, రమేష్, ఎ.రాజేందర్, శ్రవణ్ పాల్గొన్నారు.
అలరించిన ధూంధాం..
ధూంధాం కార్యక్రమంలో కిషోర్, నాగరాజు, దేవేందర్, రవి, రమ కళాకారుల బృందం పాటలతో మాటలతో చైతన్యం కల్పించారు. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారంటూ.., జైబోలో తెలంగాణ, వందనం వీరులకు వందనం అమరులకు వందనం అంటూ పాటలు పాడి సాంస్కృతిక నృత్యాలతో ప్రజలను ఉర్రూతలూగించారు.
Comments
Please login to add a commentAdd a comment