
హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే మా పార్టీ నుంచి పోటీ చేసే వారు సంప్రదించవచ్చునని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు మా ముందున్న లక్ష్యం పార్టీని బలోపేతం చేయడమేనని వ్యాఖ్యానించారు. వికాలాంగుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలి.. అలాగే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మా పార్టీకి సంబంధించి మహిళా విభాగాన్ని కూడా విస్తరిస్తామని చెప్పారు. గ్రామాలను సస్యశ్యామలం చేయడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. కేరళలో గ్రామ పంచాయతీలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. జనసమితికి అప్లికేషన్ పెట్టుకోవచ్చునని, సభ్యత్వ నమోదు చేసుకోవచ్చునని, ఆన్‌లైన్‌లో కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఉంచుతామని తెలిపారు. తెలంగాణ జన సమితి పార్టీ జిల్లాల ఇంఛార్జుల ఎంపిక జరుగుతోందని, పార్టీ ప్రతీ పల్లెకు చేరాలనే లక్ష్యంగా ఈ ప్రణాళిక ఉంటుందని వివరించారు.