కోదండరామ్‌ పిటిషన్ రేపటికి వాయిదా | high court postpones kodanda rams petition to tomarrow | Sakshi
Sakshi News home page

కోదండరామ్‌ పిటిషన్ రేపటికి వాయిదా

Published Mon, Feb 20 2017 5:25 PM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

కోదండరామ్‌ పిటిషన్ రేపటికి వాయిదా - Sakshi

కోదండరామ్‌ పిటిషన్ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ :
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్‌) చైర్మన్‌ కోదండరామ్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి(మంగళవారం) వాయిదా వేసింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్‌కు పోలీసులు అనుమతినివ్వకపోవడంతో టీజాక్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

శాంతియుతంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేపడతామని హామీ ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని టీజాక్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్, అధికార ప్రతినిధి జి.వెంకటరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లో ర్యాలీకి అనుమతి కుదరదని, మరో చోట ర్యాలీ నిర్వహిస్తే అభ్యంతరం లేదని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement