‘కొలువుల కొట్లాట’పై రేపు హైకోర్టు తీర్పు | High Court verdict on koluvu kolkata will be tomorrow | Sakshi
Sakshi News home page

‘కొలువుల కొట్లాట’పై రేపు హైకోర్టు తీర్పు

Published Thu, Nov 23 2017 1:45 PM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

High Court verdict on koluvu kolkata will be tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 'కొలువులకై కొట్లాట' సభకు అనుమతించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. తెలంగాణ జేఏసీ నేతలు సరూర్‌నగర్‌ ఎల్బీ స్టేడియంలో ఈ నెల 30 న నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గతంలో ఈ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చినా తేదీని మార్చుకోవాలని పోలీసులు అంటున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ నెల 30 న అంతర్జాతీయ వ్యాపార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సందర్భంగా కొలువుల కొట్లాట సభకు భద్రత కల్పించ లేమని ప్రభుత్వం తరపు న్యాయవాది శరత్‌ కోర్టుకు తెలిపారు. 30 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 తర్వాత మరో తేదీ కోరితే అనుమతి ఇస్తామన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement