ప్రభుత్వానిది ఒంటెద్దు పోకడ
Published Tue, Jun 20 2017 4:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
హైదరాబాద్: ప్రభుత్వం జోన్ల వ్యవస్థ రద్దు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఓయూలో ‘స్థానిక రిజర్వేషన్లు-జోనల్ వ్యవస్థ’పై విద్యార్థి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడుతూ.. జోన్ల వ్యవస్థ పై నిపుణుల స్థాయి కమిటీ వేయాలని కోరారు. యువజన, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు చేయాలన్నారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం వినటము లేదని, ఒంటెద్దు పోకడ పోతుందని విమర్శించారు.
Advertisement
Advertisement