
ప్రజలపై దాడి
జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న దాడిని తెలంగాణ ప్రజల పై దాడిగా సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి అభివర్ణించారు.
సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న దాడిని తెలంగాణ ప్రజల పై దాడిగా సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి అభివర్ణించారు.మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోదండరాంను చూసి టీఆర్‌ఎస్ ఉలిక్కి పడుతోందన్నారు. ఆయనపై టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇవి తెలంగాణవాదులను, ప్రజలను అవమాన పర్చడమేనన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాన్నే కోదండరాం చెప్పారన్నారు. వాటిని సలహా లు, సూచనలుగా తీసుకుని ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కోదండరాంను జేఏసీకి చైర్మన్‌గా ఎన్నిక చేసుకున్నామని, సకల జనుల సమ్మె వంటి పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి టీజేఏసీ అనుకూలంగా నడవాలా అని ప్రశ్నించారు. ఆయన ఉన్న మాటంటే ఉలుకెందుకన్నారు.