టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పలుచోట్ల ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి కోదండరాం నాలుగో విడత స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు.