సినీ విమర్శకుడు కత్తి మహేష్
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో ఎదుగుదల కనిపిస్తోందని, అయితే అది ఆచరణలోకి రావాలని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి పవన్ కోరినట్లు ప్రత్యేకంగా జేఏసీ అవసరం లేదని, పోరాడుతున్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిస్తే సరిపోతుందని అన్నారు. గురువారం ఉదయం కత్తి మహేష్ విజయవాడ లెనిన్ సెంటర్ లో విపక్షాలతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. (కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని పవన్‌కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేసిన తరహాలోనే ఏపీలో కూడా ప్రత్యేక హోదా జేఏసీ ఏర్పాటు చేస్తామని నిన్న ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.)
మరోవైపు ప్రత్యేక హోదాను స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టిన చంద్రబాబు సర్కార్ కు బుద్ది చెబుతామని విద్యార్థి, యువజన సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర బంద్ లో భాగంగా విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మట్టి, నీరుతో రాష్ట్రంను నిలువునా కేంద్రం దగా చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment