katti Mahesh
-
కత్తి మహేష్ మృతిపై విచారణ జరపటానికి సిద్ధం
అమరావతి: సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు ఉంటే విచారణ జరపటానికి సిద్ధమని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. కత్తి మహేశ్ దళిత జాతిలో ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తి అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో కూడా మహేశ్ ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.17 లక్షలు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని కొందరు చేస్తున్న ప్రకటనలపై మంత్రి సురేశ్ స్పందించారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మహేశ్ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి సురేశ్ హామీ ఇచ్చారు. -
అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!
చిత్రం: ‘రాంగ్ గోపాల్ వర్మ’; తారాగణం: షకలక శంకర్, ప్రభు, కత్తి మహేశ్; కెమెరా: బాబు; కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు; రిలీజ్: డిసెంబర్ 4; ఓ.టి.టి: శ్రేయాస్. నిజజీవిత వ్యక్తుల జీవితాన్నీ, ప్రవర్తననూ ఆధారంగా చేసుకొని, వారి మీద వ్యంగ్య బాణాలు, విమర్శలు సంధిస్తూ సినిమాలు తీయడం ఓ ప్రత్యేకమైన జానర్. మిగిలిన ప్రాంతీయ భాషా సినీ సీమల్లో కన్నా తెలుగులో ఈ కోవ చిత్రాలు కాస్తంత ఎక్కువే! 1980లలోనే పెద్ద ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘మండలాధీశుడు’, ‘గండిపేట రహస్యం’ లాంటి వ్యంగ్యాత్మక సినీ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఫిక్షనల్ రియాలిటీ చిత్రాలకు పరాకాష్ఠ – ఇటీవల కరోనా కాలంలో హీరో పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘పవర్ స్టార్’. దానికి పోటీగా వర్మపై షకలక శంకర్ హీరోగా వచ్చిన ‘పరాన్నజీవి’. ఈ పర్సనల్ ట్రోలింగ్ సినిమాల మధ్య రచయిత జొన్నవిత్తుల తీస్తానని ప్రకటించిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) చిత్రం ఇంకా తయారీలో ఉంది. ఇంతలో తాజాగా సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు రూపొందించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కథేమిటంటే..: పబ్లిసిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం రాజ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) అనే ఓ అగ్ర దర్శకుడు విపరీత ధోరణులకు పాల్పడుతుంటారు. ఆ ధోరణిని అతని అసిస్టెంట్లు (కత్తి మహేశ్ వగైరా) ప్రశ్నిస్తారు. దానికి ఆర్జీవీ తనదైన జవాబిస్తారు. కానీ, చివరకు ఆర్జీవీని అంతరాత్మే నిలదీస్తుంది. దానికి ఆయన రియాక్షన్ తెరపై చూడాలి. సినిమా టైటిల్‌ను బట్టి, టైటిల్ రోల్ నటుడి హావభావాలను బట్టి, అంశాలను బట్టి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిన ఫిక్షనల్ రియాలిటీయో ఇట్టే అర్థమైపోతుంది. ‘ఎ రైట్ డైరెక్టర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్’ అంటూ టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌తోనే సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నదీ, ఏం చూపించదలుచుకున్నదీ ఈ చిత్రదర్శకుడు తేల్చేశారు. ఎలా తీశారంటే..: ఆర్జీవీని అనుకరించడంలో దిట్ట అయిన షకలక శంకర్ ఆ హావభావాలనూ, డైలాగ్ డెలివరీనీ యథోచితంగా మెప్పించారు. దర్శకుడు ప్రభు సినిమాలో తన నిజజీవిత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రధారులు, పరిమిత సాంకేతిక విభాగాల పనితనం అంతే పరిమితం. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ప్రభుది. ఆయన తన గురువును ఆదర్శంగా తీసుకొని, ఈ 42 నిమిషాల సినిమాకు తానే కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్ళుగా సినీ జర్నలిజమ్‌లో అబ్బిన ప్రశ్నించే లక్షణాన్ని ఈసారి కలంతో కాక కెమేరాతో ఆయన వ్యక్తం చేశారనుకోవాలి. ఆర్జీవీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీయడానికి వివిధ మెగా సినీ వర్గాల నుంచి ప్యాకేజీలు అందాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నంపై పరిశ్రమలో ఓ చిన్న ఆసక్తి నెలకొంది. ఆ గాలివార్తలను కొట్టిపారేసిన దర్శకుడు సినీ పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణిని ప్రశ్నించడమే ఈ సినిమా లక్ష్యమని తేల్చారు. అదే సమయంలో ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో కాక, ఆవేదనతో ఈ ప్రయత్నం చేసినట్టు సినిమా చివర చెప్పుకొచ్చారు. మొత్తం మీద కొత్త తరహా సినిమా టేకింగ్, ఆలోచనలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ అగ్ర దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు, ఫిక్షనల్ రియాలిటీ పేరుతో ట్రోలింగ్ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోవడాన్ని ఈ సినిమా చర్చకు పెడుతుంది. ఆత్మవిమర్శతో పంథా మార్చుకుంటే, ఇప్పటికీ ఆస్కార్ అందుకొనే ప్రతిభ ఆ దర్శకుడికి ఉందని అంటుంది. ‘నా జీవితం, నా సినిమా, నా పోర్న్ కాలక్షేపం, నా ఓడ్కా, నా ట్వీట్లు... నా ఇష్టం’ అనే ఆర్జీవీకి ఇలాంటి సద్విమర్శలూ, సలహాలూ కొత్త కావు. కానీ, సెన్సార్ అవసరం లేని ఓటీటీల పుణ్యమా అని ఆర్జీవీతో సహా పలువురు తీస్తున్న కంటెంట్‌ను చూసినప్పుడు చాలామందిలో కలిగిన ఆవేదనకు తెర రూపం – ఈ లేటెస్ట్ సినిమా. అంతమాత్రాన ఈ తాజా సినిమాతో ఆర్జీవీ సహా అసలు ఎవరైనా మారిపోతారనుకోవడమూ అత్యాశే. అయినా సరే, సినీ రంగంలో ఉంటూ కూర్చున్న చెట్టుకే చేటు తెస్తున్నారన్న వాదనతో ప్రభు ఈ చిరుప్రయత్నం చేశారు. దీనిలో సగటు సినిమా లక్షణాలు వెతుక్కోవడం వేస్ట్. పరిమితమైన బడ్జెట్లో, అతి పరిమితమైన వనరులు, సాంకేతిక సౌలభ్యాలతో తీసిన ఈ కొత్త గిల్లుడు సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీ వేదికలో ఎంత మందికి చేరుతుందో చెప్పలేం. ఎంతమందిని ఆకట్టుకుంటుందో కూడా చెప్పలేం. కాకపోతే, గొప్ప సినీ ప్రయత్నం కాకున్నా... ధర్మాగ్రహంతో వేసిన ఓ ఆవేదనాభరిత ప్రశ్నగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మిగిలిపోవచ్చు. కొసమెరుపు: అగ్రదర్శకుడిపై కలం చూపిన కెమేరా ఆగ్రహం. బలాలు: సినీసీమలో అవాంఛనీయ ధోరణిపై ఆగ్రహం వర్మ చుట్టూ ఉన్న వివాదాలు గడచిన ‘గిల్లుడు సినిమా’ల్లోని అంశాల ప్రస్తావన బలహీనతలు: విడిగా కథంటూ ఏమీ లేకపోవడం విమర్శలు, విశ్లేషణలతోనే మొత్తం సినిమా సాగడం పరిమిత బడ్జెట్, పరిమిత టెక్నికల్ సహకారం – రెంటాల జయదేవ -
కత్తి మహేష్ బహిష్కరణ అప్రజాస్వామికం
కర్నూలు(న్యూసిటీ): రాముడుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడం అప్రజాస్వామికమని రచయిత ఇనాయుతుల్లా, దళిత సంఘాల నాయకులు కె. శ్రీనువాసులు, బాలసుందరం, ఎల్హెచ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్‌నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట బీసీ, ఎసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కత్తి మహేష్ బహిష్కరణ వెనుక మతోన్మాదం శక్తుల కుట్ర ఉందని ఆరోపించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి కుట్ర పన్ని మహేష్‌పై కేసు నమోదు చేయించారన్నారు. ఈ ధర్నాలో ఆ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, రాయలసీమ మాల మహనాడు అధ్యక్షుడు మాదాసు నాగరాజు, మైనార్టీ నాయకుడు ఖదీర్, మహిళా సంఘాల నాయకురాలు పట్నం రాజేశ్వరి, వేల్పుల జ్యోతి, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గోపి, కాంత్రి కుమార్, జపన్యా, హసీనా, విజయలక్ష్మి, శైలజ, జయంతి, సుజానమ్మ, తదితరులు పాల్గొన్నారు. కత్తి మహేష్‌పై బహిష్కరణ ఎత్తివేయాలి కత్తి మహేష్‌పై విధించిన బహిష్కరణను ఎత్తివేయాలని ఎంఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్. విజయ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట «ధర్నా నిర్వహించారు. ధర్నాలో నాయకులు మాధవ శంకర్, మద్దిలేటి, మునిస్వామి, భాస్కర్, శేఖర్, తారానాథ్ పాల్గొన్నారు. -
కత్తి మహేశ్ దిష్టిబొమ్మ దహనం
మల్యాల/రామడుగు: రాముడిపై అనుచిత వ్యా ఖ్యాలుచేసిన కత్తి మహేశ్ దిష్టిబొమ్మను విశ్వహిం దూపరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మంగళవా రం మల్యాల మండలంలో దిష్టిబొమ్మను దహనంచేసి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. భజరంగ్‌దళ్ జిల్లా కోకన్వీనర్ బొద్దుల మ హేందర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామిని గృ హనిర్భందం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రా జారంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమం లో భజరంగ్ దళ్ జిల్లా కోకన్వీనర్ బొద్దుల మ హేందర్తోపాటు బట్టు నరేశ్, గణేశ్, నరేశ్, చొప్ప దండి నియోజక వర్గ బీజేపీ కన్వీనర్ జిన్నాం విద్యాసాగర్, నాయకులు జిట్టవేని అంజిబాబు, బండపల్లి శ్రీధర్, రమేశ్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ నుంచి ‘కత్తి’ బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్రంగా స్పందిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. భావ వ్యక్తీకరణ పేరుతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను ఆరు మాసాలపాటు హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటిం చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా ఆందోళనల పేరుతో మరికొన్ని గ్రూపులు రంగంలోకి దిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు యత్నిస్తున్నాయని, వారికి తామెంత మాత్రం అవకాశం ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ‘భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కే. దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలే తప్ప ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించకూడదు. తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్, హాజర్డష్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 కింద ఆరు నెలల పాటు కత్తి మహేశ్‌ను రాజధాని నుంచి బహిష్కరిస్తున్నాం. మహేశ్‌ను తన స్వస్థలమైన చిత్తూరు జిల్లా కు తరలించాం. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో ఉండొచ్చు. కాని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, సమాజాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపైనా చర్యలు తప్పవు’ అని ఆయన హెచ్చరించారు. న్యూస్ చానల్‌పై చర్యలు కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసి ప్రజ ల్లో అశాంతి కలిగేలా వ్యవహరించిన ఓ న్యూస్ చాన ల్‌పై చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. సంబంధిత చానల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన సదరు చానల్‌పై కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ నంబర్–7 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చానల్ ఇచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చ రించారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా, తీసుకునేలా ప్రేరేపించినా కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపిస్తామన్నారు. నగర బహిష్కరణ ఉత్తర్వులను ఉల్లంఘించి కత్తి మహేశ్ మళ్లీ నగరంలోకి అడుగుపెడితే మూడేళ్లపాటు జైలు శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందన్నారు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. సరైన చర్యలు తీసుకునేలా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. కత్తి మహేశ్ బహిష్కరణ ప్రస్తుతం హైదరాబాద్ వరకే పరిమితమని, అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ విధిస్తామన్నారు. ఏపీలో మీడియాతో మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామన్నారు. కత్తి మహేశ్‌పై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయన్నారు. ధార్మిక సంఘాలు, ఇతరులు చట్టాలను చేతుల్లోకి తీసు కుని అశాంతికి కారణం కావద్దని, ఏదైనా సమస్య తలె త్తితే దాన్ని పరిష్కరించేందుకు పోలీస్ శాఖ, ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో నగర కమిషనర్ అంజనీకుమార్, అదనపు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, డీఐజీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. కత్తి మహేశ్‌పై కేసు నమోదు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా, సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టీవీ చర్చా వేదికలో రామాయణాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ సంబంధిత ఆధారాలతో రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి ఈనెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కత్తి మహేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీజీపీని కలసిన బీజేపీ ఎమ్మెల్యేలు కత్తి మహేశ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్.. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీని కలిశారు. స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతోపాటు ఆయనను గృహ నిర్బంధం చేయడం, ఆయన ఇంటికి తాము వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఫిర్యాదు చేశారు. మహేశ్ నగర బహిష్కరణపై రాజాసింగ్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ నుంచి బహిష్కరించాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. యాదాద్రి సందర్శనకు పరిపూర్ణానందకు అనుమతివ్వాలని కోరినట్టు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పారు. -
కత్తి వ్యాఖ్యలపై స్పందించిన జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సమాజ సామరస్యానికి భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు. ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు సంయనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదన్నారు. అలాంటప్పుడే రాజకీయ నాయకులు.. ఇది సరికాదని తెలుసుకుంటారన్నారు. సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. రైతుబంధుపై వివరణ ఇవ్వాలి మరోవైపు రేషన్ డీలర్ల సమస్య విషయంలో ప్రభుత్వం దిగి వచ్చినందుకు అభినందిస్తున్నామన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ఎందుకు పెట్టిందో వివరణ ఇవ్వాలన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కోసమే పథకం అయితే పర్వాలేదు. కానీ పథకం లక్ష్యం నెరవేరటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద లెక్కలు లేకపోవటంతో వ్యవసాయం చేసే వారికి నష్టం జరుగుతుందన్నారు. రైతుబంధు పథకాన్నీ స్వాగతిస్తూనే.. నిజమైన సాగుదార్లకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వివరాలు, సూచనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని, వ్యవసాయం చేసే వారికి మాత్రమే సహాయం అందాలన్నారు. అవసరమైతే పట్టాదారుల నుంచి సాగుదార్లకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
శ్రీరాముడు సీతమ్మ ఆయనతో ఉంటే బాగుండేది: కత్తి మహేష్
కరీమాబాద్: ‘శ్రీరాముడు దగుల్బాజీ..సీతమ్మ రావణుడితోనే ఉంటే బాగుండేదని’ హైందవుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆదివారం నగరంలోని మిల్స్‌కాలనీ పోలీస్టేషన్లో లేబర్‌కాలనీకి చెందిన అడ్వకేట్ బాలినె శ్రీనివాస్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ నందిరామ్‌ను వినతిపత్రంలో కోరినట్లు శ్రీనివాస్‌రావు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు పుప్పాల రాజేందర్ ఉన్నారు. -
కత్తి మహేష్‌పై హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం
-
బాబు గోగినేనిపై కేసు కక్ష వేధింపు చర్యే
-
డేర్ డెవిల్
నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్, కత్తి మహేశ్, అమిత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌడీ పోలీస్’. ఆర్.ఎ. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ కృష్ణంరాజు నేతృత్వంలో గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్ తదితరులపై పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత జాని మాట్లాడుతూ–‘‘మాఫియా నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది. నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. మే చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తొలిసారిగా ఓ డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నా’’ అన్నారు గుర్లిన్ చోప్రా. ‘‘అదుర్స్, కృష్ణ’ వంటి హిట్ చిత్రాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని తెలుగులో ‘రౌడీ పోలీస్’ చేస్తున్నా’’ అన్నారు ముకుల్ దేవ్. కత్తి మహేశ్, కెమెరామెన్ ముజీర్ పాల్గొన్నారు. -
పవన్ ఆలోచనల్లో ఎదుగదల, కానీ..: కత్తి
సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో ఎదుగుదల కనిపిస్తోందని, అయితే అది ఆచరణలోకి రావాలని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి పవన్ కోరినట్లు ప్రత్యేకంగా జేఏసీ అవసరం లేదని, పోరాడుతున్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిస్తే సరిపోతుందని అన్నారు. గురువారం ఉదయం కత్తి మహేష్ విజయవాడ లెనిన్ సెంటర్ లో విపక్షాలతో కలిసి బంద్ లో పాల్గొన్నారు. (కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని పవన్‌కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం చేసిన తరహాలోనే ఏపీలో కూడా ప్రత్యేక హోదా జేఏసీ ఏర్పాటు చేస్తామని నిన్న ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.) మరోవైపు ప్రత్యేక హోదాను స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టిన చంద్రబాబు సర్కార్ కు బుద్ది చెబుతామని విద్యార్థి, యువజన సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్ర బంద్ లో భాగంగా విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మట్టి, నీరుతో రాష్ట్రంను నిలువునా కేంద్రం దగా చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కత్తి మహేశ్‌పై కోడిగుడ్లతో దాడి
హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. గురువారం రాత్రి ఓ టీవీ చానెల్లో చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాబ్‌లో వెళ్తుండగా కొండాపూర్‌లో కోడి గుడ్లతో దాడికి పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు సిగ్నల్ దాటుతుండగా కోడిగుడ్లతో కొట్టారని కత్తి మహేశ్ తెలిపారు. కుడి కన్నుపై కోడిగుడ్డు పడటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని చెప్పారు. ఇది కచ్చితంగా పవన్ కల్యాణ్ అభిమానుల పనేనని ఆరోపించారు. కొద్ది రోజులుగా అభిమానులను అదుపు చేసేందుకు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఈ దాడికి పవన్ అభిమానులనే బాధ్యులను చేస్తున్నానన్నారు. రేపు పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మల దహనం కత్తి మహేశ్‌పై దాడిని ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ఓయూ జేఏసీ ప్రతినిధి వరంగల్ రవి పేర్కొన్నారు. పవన్ కుటుంబానికి ఎక్కువగా దళితులే అభిమానులుగా ఉన్నారని, అలాంటిది ఓ దళితుడైన కత్తి మహేశ్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. కత్తి మహేశ్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. -
మరోసారి తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్ బుధవారం చంచల్‌గూడ జైలులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని పేర్కొంటూ ఎమ్మార్పీఎస్‌కు తన మద్దతు ప్రకటించారు. పవన్ స్పందన కోసం చూస్తున్నా.. సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కూడా కత్తి మహేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. జనసేన తోక పార్టీ అని, పవన్ తప్ప ఆ పార్టీలో జనమే లేరని ఎద్దేవా చేశారు. జనసేనను ఎవరైనా రాజకీయ పార్టీ అంటారా అని ప్రశ్నించారు. నటి పూనమ్ కౌర్‌పై తన ప్రశ్నలకు పవన్ స్పందించాలని ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. సినీ అభిమానులను పవన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. -
మందకృష్ణకు జిగ్నేష్, కత్తి మహేష్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ బుధవారం చంచల్‌గూడ జైలులో ఉన్న ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘నా అంతరాత్మ ప్రభోదానుసారం మందకృష్ణను కలిశా. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలి. హక్కులకై పోరాడుతున్న మందకృష్ణను జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దళితుల ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళతాం. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాలి. ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా చేయాలి. అలాగే తెలంగాణలో దళితులకు అయిదు ఎకరాల భూమి ఇవ్వాలి. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన తెలంగాణలో తీవ్రస్థాయికి చేరుకుంది. రోహిత్ వేముల బతికుంటే నాతో కలిసి వచ్చేవారు’ అని అన్నారు. మందకృష్ణను కలిసిన కత్తి మహేష్ మరోవైపు మందకృష్ణను కత్తి మహేష్ కూడా కలిశారు. చంచల్‌గూడకు వెళ్లి...మందకృష్ణను పరామర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేపడుతున్న పోరాటానికి కత్తి మహేష్ మద్దతు తెలిపారు. కాగా ట్యాంక్‌బండ్ వద్ద అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహించారంటూ మందకృష్ణ మాదిగపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రెండురోజుల క్రితం మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా మందకృష్ణను కలిశారు. -
సొసైటీలో ‘సోషల్’ క్రేజ్
సాక్షి, హైదరాబాద్: ప్రచారానికైనా.. నిరసనకైనా.. పొగడ్తలకైనా.. తెగడ్తలకైనా ఇప్పుడంతా సోషల్ మీడియానే. కయ్యానికి కాలుదువ్వాలన్నా, దూసిన కయ్యానికి పదును పెరగాలన్నా.. నిర్ణయాలు తీసుకోవాలన్నా, తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించాలన్నా.. వ్యాపార ప్రకటనలకైనా, కీర్తిప్రతిష్టలకైనా ఆయుధం, అస్త్రం సామాజిక మాధ్యమమే. మనోభావాలను పంచుకోవడం, సమకాలీన పరిస్థితులపై గళం విప్పడం, నవీన ఆవిష్కరణలకు నాంది పలకడం, సామాజిక సేవకు సంసిద్ధులవడం.. అన్నింటికీ సోషల్ మీడియా వేదికవుతోంది. కీలక నిర్ణయాలు, ఘాటైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు హల్చల్ చేస్తున్నారు. ట్రంప్, కిమ్ ట్వీట్ వార్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇటు పాకిస్తాన్, అటు ఉత్తర కొరియాపై కొన్ని నెలలుగా తన నిర్ణయాలను ట్వీటర్లో వెలువరిస్తున్నారు. పాక్‌కు భద్రత సహాయం వెనక్కి తీసుకోవడం నుంచి ఆర్థిక సహాయం వరకూ ట్వీటర్లోనే తెలిపారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నిర్ణయాలను వ్యతిరేకించ డంతో పాటు అణుయుద్ధానికి ఢీ అంటే ఢీ రీతిలో స్పందించి ప్రపంచమంతా తన నిర్ణయాలపై చర్చించుకునేలా చేశారు. ప్రతి రోజూ టాప్ ట్రెండింగ్ దేశంలో ఎక్కువగా ఏ విషయానికి ట్వీటర్‌ను వాడారో ప్రతిక్షణం అందులో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్ పుట్టినరోజు సందర్భంగా కోట్ల మంది శుభాకాంక్షలు తెలిపారు. 100 శాతం ఎఫ్డీఐలపైనా ట్వీటర్లో భారీ చర్చే జరిగింది. మొబైల్ ఫోన్ ఆఫర్లపై ట్వీట్లకూ భారీ డిమాండ్ కనిపించింది. పొలిటికల్ ట్వీట్ వార్ రాష్ట్రంలో రాజకీయపరంగా ట్వీటర్ ఖాతా వినియోగంలో మంత్రి కేటీఆర్ అందరికన్నా ముందున్నారు. తన నిర్ణయాలు, అభిప్రాయాలను మంత్రి ట్వీటర్లో వెల్లడిస్తున్నారు. తమ సమస్యలనూ ప్రజలు ట్వీటర్లోనే తెలపడం, నిర్ణయాన్నీ అక్కడే వెలువరించడం జరుగుతోంది. తెలంగాణలో సంచలనం రేపిన డ్రగ్స్ కేసుపై ట్వీటర్లో దుమారం రేగింది. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినపుడు మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య రగులుతున్న హిందూ రగడ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలు కంగనా రనౌత్, హీరో హృతిక్ రోషన్ మధ్య వేధింపుల వ్యవహారమూ ట్వీటర్ వేదికగా బాలీవుడ్ ఇండ స్ట్రీలో వేడి రగిల్చింది. తాజాగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై టాలీవుడ్ సినీ విమర్షకుడు కత్తి మహేశ్ ట్వీట్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదే వ్యవహారంలో హీరోయిన్ పూనమ్‌కౌర్ ట్వీట్లూ వేడి రగిల్చాయి. అలాగే అమాయక యువతను తెలంగాణ పోలీస్ ఉగ్రవాదం పేరుమోపి వేధిస్తోందని డిగ్గీరాజా చేసిన వ్యాఖ్యలను ట్వీటర్లోనే పోలీస్ శాఖ తిప్పికొట్టింది. కంపెనీలు సైతం.. ట్వీటర్లో పలు కంపెనీలకు మంచి క్రేజ్ ఉంది. బ్యాంకుల్లో ఎస్ బ్యాంకు, ఎస్బీఐ, ఆర్ఐడీఎల్ఆర్తో పాటు మొబైల్ కంపెనీల్లో రియలన్స్, ఎయిర్టెల్, ఫ్లిప్‌కార్ట్, బీఎండబ్ల్యూ, సామ్సంగ్, కేరళ టూరిజం, ఎఫ్1 రేస్, జాతీయ మీడియా చానళ్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్, మ్యూజిక్ చానళ్లున్నాయి. నో మాస్, నో క్లాస్.. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్వీటర్ హవా అంతా ఇంతా కాదు. అమెరికా అధినేత ట్రంప్ నుంచి సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వరకు ట్వీటర్ వేదికగా చెలరేగుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ట్వీట్ చేసినా క్షణాల్లో స్పందించడం, ప్రతి ట్వీట్ చేయడం జరుగుతోంది. మరోవైపు ట్వీటర్కు ఏమాత్రం తగ్గకుండా ఫేస్బుక్ కూడా సామాజిక పోస్టింగ్ వార్‌లో తనదైన ముద్ర వేస్తోంది. మాస్, క్లాస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఖాతా తెరుస్తు న్నారు. అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సోషల్ మీ డియా వార్‌లో ట్వీటర్, ఫేస్బుక్ ప్రధాన ఆయు ధాలుగా నిలుస్తున్నాయని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కోట్లలో ఫాలోవర్స్ ప్రధాని నరేంద్రమోదీ తన అధికార నిర్ణయాలు, అభిప్రాయాలు అధికారిక ట్వీటర్ ఖాతాæ ద్వారా పంచుకుంటున్నారు. ఆయనకు దాదాపు 3.9 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాహుల్‌గాంధీ ట్వీట్లకూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం రాహుల్‌కు 55 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ కురువృద్ధుడు దిగ్విజయ్‌సింగ్ చేసే ట్వీట్లు హాట్ టాపిగ్గా మారుతుంటాయి. ప్రధానిపై వాడివేడిగా ట్వీట్లు చేస్తుంటారు. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీల్లో అమితాబ్‌బచ్చన్, షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రజనీకాంత్, దీపికా పదుకోన్, హృతిక్‌రోషన్, ప్రియాంకాచోప్రా, అక్షయ్‌కుమార్, ఏఆర్ రెహమాన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, కరణ్ జోహార్, అభిషేక్‌బచ్చన్, సోనమ్‌కపూర్, షాహిద్‌కపూర్, ఆలియాభట్, అనుష్కశర్మ ఉన్నారు. రాజకీయరంగానికొస్తే ప్రధాని మోదీతోపాటు అరవింద్ కేజ్రీవాల్, శశి థరూర్, సుష్మాస్వరాజ్, ఒమర్ అబ్దుల్లా, ఎస్ఎం కృష్ణ, దిరిక్ ఓబ్రియాన్, సల్మాన్ అనీజ్, కేడీ సింగ్, రాజీవ్ చంద్రశేఖర్, ప్రియాదత్, సంజయ్ నిరుపమ్, స్మృతీ ఇరానీ, అఖిలేశ్‌యాదవ్, అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కరీ తదితరులున్నారు. టాలీవుడ్లో నాగార్జున, పవన్‌కళ్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, రానా, నితిన్, అఖిల్, సమంత, రకుల్‌ప్రీత్‌సింగ్, తదితరులున్నారు. -
ట్విట్టర్ పార్టీలో.. కులపిచ్చిగాళ్లు : కత్తి మహేష్
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినతే పవన్ కళ్యాణ్ పై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై కత్తి మహేష్ ఘాటుగా స్పందించారు. తన ఫేస్ బుక్ పేజీలో వరుస పోస్టులతో పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడులపై ధ్వజమెత్తారు. కత్తి మహేష్ ఏమన్నారంటే.. జనసేన ఓ ట్విట్టర్ పార్టీ.. రూల్స్ ప్రకారం చూసుకుంటే, జనసేన అసలు పార్టీనే కాదు. కేవలం ట్విట్టర్ పార్టీ. రాజకీయ పార్టీ అవ్వడానికి కావలసిన కనీస అర్హతలు లేని పార్టీ. చంద్రబాబు గారు దయతో కొన్ని సీట్లు కేటాయించి, వచ్చే ఎన్నికల్లో అయినా జనసేన కి పార్టీ హోదా కల్పించకపోతే, మరో జెనరేషన్ యూత్ వెర్రి వెంగలప్పలుగా మిగిలిపోతారు. జనం లేరు. సేన లేదు. పిచ్చి అభిమానులు. కుల పిచ్చిగాళ్ళు మాత్రం ఉన్నారు. మేము రెడీ అంటే, ముందు నేను పోరాడతా అంటావ్... స్పెషల్ స్టేటస్ అంటే జోకైపోయింది. వైజాగ్ రమ్మని పిలుపినిచ్చావ్. నువ్వు మాత్రం రాలేదు. మీ దోస్త్ చంద్రబాబు స్పెషల్ ప్యాకేజికి, స్టేటస్ కి తేడాలేదు అనేస్తాడు. నువ్వు మళ్ళీ స్టేటస్ కావాలంటే పోరాడాలి అంటావు. మేము రెడీ అంటే, ముందు నేను పోరాడతా అంటావ్. అసలు ఒక్క విషయం మీద అయినా క్లారిటీ ఉందా! ఆ క్లారిటీ లేదనే విషయం అయినా క్లియర్‌గా అర్థం అవుతోందా?! చంద్రబాబును ఎలా వెనకేసుకురావాలో ఆర్థం కావడం లేదా? ప్రతిదానికీ 'చంద్రబాబు కి తెలియకపోవచ్చు' అంటావేంటయ్యా బాబూ... ఆయన ముఖ్యమంత్రి కాడా, లేక అంత పనికిమాలినవాడు అని నీ అభిప్రాయమా!? లేక ఎలా వెనకేసుకు రావాలో నీకు అర్థం కావడం లేదా! మంచి కన్సల్టెంట్లను, అడ్వైజర్లను పెట్టుకో. నన్ను ఏమైనా ఈ విషయంలో సలహాలివ్వమంటే ఇస్తా. ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రిజైన్ చెయ్యాలో.. నిజమే...ఎక్కడో రైలు దుర్ఘటన జరిగితే లాల్ బహుదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రిజైన్ చెయ్యాలో. ఒకసారైనా రిజైన్ చెయ్యమని కోరకూడదా పవన్ కళ్యాణ్!.. అంటూ మహేష్ కత్తి నిప్పులు చెరిగారు. -
'పెసరట్టు' మూవీ స్టిల్స్