హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై హైదరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. గురువారం రాత్రి ఓ టీవీ చానెల్‌లో చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాబ్‌లో వెళ్తుండగా కొండాపూర్‌లో కోడి గుడ్లతో దాడికి పాల్పడ్డారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు సిగ్నల్ దాటుతుండగా కోడిగుడ్లతో కొట్టారని కత్తి మహేశ్ తెలిపారు.
కుడి కన్నుపై కోడిగుడ్డు పడటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని చెప్పారు. ఇది కచ్చితంగా పవన్ కల్యాణ్ అభిమానుల పనేనని ఆరోపించారు. కొద్ది రోజులుగా అభిమానులను అదుపు చేసేందుకు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఈ దాడికి పవన్ అభిమానులనే బాధ్యులను చేస్తున్నానన్నారు.
రేపు పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మల దహనం
కత్తి మహేశ్‌పై దాడిని ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ఓయూ జేఏసీ ప్రతినిధి వరంగల్ రవి పేర్కొన్నారు. పవన్ కుటుంబానికి ఎక్కువగా దళితులే అభిమానులుగా ఉన్నారని, అలాంటిది ఓ దళితుడైన కత్తి మహేశ్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించారు. కత్తి మహేశ్‌కు అండగా ఉంటామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment