ధర్నా చేస్తున్న దృశ్యం
కర్నూలు(న్యూసిటీ): రాముడుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడం అప్రజాస్వామికమని రచయిత ఇనాయుతుల్లా, దళిత సంఘాల నాయకులు కె. శ్రీనువాసులు, బాలసుందరం, ఎల్‌హెచ్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్‌నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట బీసీ, ఎసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కత్తి మహేష్ బహిష్కరణ వెనుక మతోన్మాదం శక్తుల కుట్ర ఉందని ఆరోపించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డి కుట్ర పన్ని మహేష్‌పై కేసు నమోదు చేయించారన్నారు. ఈ ధర్నాలో ఆ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, రాయలసీమ మాల మహనాడు అధ్యక్షుడు మాదాసు నాగరాజు, మైనార్టీ నాయకుడు ఖదీర్, మహిళా సంఘాల నాయకురాలు పట్నం రాజేశ్వరి, వేల్పుల జ్యోతి, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు గోపి, కాంత్రి కుమార్, జపన్యా, హసీనా, విజయలక్ష్మి, శైలజ, జయంతి, సుజానమ్మ, తదితరులు పాల్గొన్నారు.
కత్తి మహేష్‌పై బహిష్కరణ ఎత్తివేయాలి
కత్తి మహేష్‌పై విధించిన బహిష్కరణను ఎత్తివేయాలని ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ఎస్. విజయ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట «ధర్నా నిర్వహించారు. ధర్నాలో నాయకులు మాధవ శంకర్, మద్దిలేటి, మునిస్వామి, భాస్కర్, శేఖర్, తారానాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment