
సాక్షి, హైదరాబాద్: సినీ విమర్శకుడు కత్తి మహేష్ బుధవారం చంచల్‌గూడ జైలులో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్రజాస్వామిక శక్తులు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు తప్పదని పేర్కొంటూ ఎమ్మార్పీఎస్‌కు తన మద్దతు ప్రకటించారు.
పవన్ స్పందన కోసం చూస్తున్నా..
సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కూడా కత్తి మహేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. జనసేన తోక పార్టీ అని, పవన్ తప్ప ఆ పార్టీలో జనమే లేరని ఎద్దేవా చేశారు. జనసేనను ఎవరైనా రాజకీయ పార్టీ అంటారా అని ప్రశ్నించారు. నటి పూనమ్ కౌర్‌పై తన ప్రశ్నలకు పవన్ స్పందించాలని ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. సినీ అభిమానులను పవన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.