ఆమనగల్లు బంద్ విజయవంతం
ఆమనగల్లు: ఆర్డీఓ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వర్తక, వ్యాపార, వృత్తిదారుల సంఘాల జేఏసీ ఆధ్యర్యంలో సోమవారం చేపట్టిన ఆమనగల్లు పట్టణ బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, పెట్రోలు బంక్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా చేశారు.
తహసీల్దార్ అనితకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, ఆమనగల్లు జెడ్‌పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు పత్యానాయక్, సింగంపల్లి శ్రీను, వర్తక సంఘ అధ్యక్షుడు కండె పాండురంగయ్య, సభ్యులు కోట తిరుపతయ్య, వీరబొమ్మ రామ్మోహన్, రాజు, వస్త్ర వ్యాపారుల సంఘ సభ్యులు వెంకటేశ్, ఎల్‌వీఆర్ రాము, శివప్ప, జగదీశ్వర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.