Amanagallu
-
రంగారెడ్డి: మహిళ గొంతు కోసి.. కాలు నరికి..
సాక్షి, ఆమనగల్లు: ఓ మహిళపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం ఆమనగల్లు మున్సిపల్ పరిధిలోని నుచ్చుగుట్ట తండా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని ముర్తుజపల్లికి చెందిన కొమ్ము గాలయ్య, పోచమ్మ (39) దంపతులు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లగా.. కరోనా నేపథ్యంలో పోచమ్మ తల్లిగారి ఊరైన మాడ్గుల మండలం చంద్రాయణపల్లికి వచ్చి నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లో పారిశుధ్య కారి్మకురాలిగా పనిచేస్తున్న పోచమ్మ.. ప్రతిరోజు చంద్రాయణపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త ఫోన్ చేయగా ఆమనగల్లులో ఆటో ఎక్కి వస్తున్నానని చెప్పింది. రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుచ్చుగుట్టతండా సమీపంలో రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమి చ్చారు. ఆమనగల్లు సీఐ ఉపేందర్, ఎస్ఐ ధర్మేశ్ çఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులు మహిళ గొంతు కోసి, కాలు నరికారు. మృతురాలిని పోచమ్మగా గుర్తించారు. సమీపంలో మృతురాలి దుస్తులు, మద్యం సీసాలు న్నాయి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. చదవండి: Hyderabad: బాలికపై సవతి తండ్రి అత్యాచారం ఐదు ప్రత్యేక బృందాలు హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలాన్ని షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్‌తో కలసి పరిశీలించారు. ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించామని, వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. పోలీసులు అదుపులో నిందితుడు? పోచమ్మను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలు, ఫోన్‌కాల్ లిస్టు ఆధారంగా ఆమనగల్లులో ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతదేహంతో ఆందోళన పోస్టుమార్టం పూర్తయిన అనంతరం పోచమ్మ మృతదేహాన్ని పోలీసులు ముర్తుజపల్లికి తరలించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆందోళనకు సిద్ధమయ్యారు. మృతదేహాన్ని తీసుకుని ఆమనగల్లులో ధర్నా చేయడానికి తరలుతుండగా జంగారెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు. -
విద్యార్థినిని కిడ్నాప్‌కు యత్నించలేదు
సాక్షి, ఆమనగల్లు: పదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆటోతో పాటు ఒమన్ దేశానికి చెందిన ఓ నిందితుడి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. గురువారం సాయంత్రం కస్తూర్బా గాంధీ గిరిజన విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న బాలిక తన స్వగ్రామానికి వెళ్తుండగా ఆటోలోని యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం స్థానిక ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నర్సింహారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కడ్తాల మండలం నార్లకుంట తండాకు చెందిన బాలిక ఆమనగల్లులోని కస్తూర్బా గాంధీ గిరిజన విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. బాలిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిత్యం స్వగ్రామం నుంచి పాఠశాలకు వచ్చి వెళ్తుండేది. ఈక్రమంలో గురువారం సాయంత్రం 5.30 గంటలకు బాలిక నార్లకుంట తండాకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై నిలబడి ఉంది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న ఆటోను చూసి ప్యాసింజర్ ఆటోగా భావించి ఆపి అందులో ఎక్కింది. ఆటోలో ఉన్న యువకుడు విద్యార్థినిని పొగతాగుతావా.. అంటూ చేయి పట్టుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర భయాందోళనకు గురై ఆటోలో నుంచి కిందికి దూకడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఘటన విషయం వెంటనే విఠాయిపల్లి సమీపంలో ఆటోతోపాటు అందులో ఉన్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. బాధితురాలి వాంగ్మూంలం మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులు ఇమ్రన్ హుస్సేన్(ఒమన్ దేశస్తుడు), మహ్మద్ సాజిద్(చంద్రాయణగుట్ట)గా గుర్తించి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ స్నేహితులు. ఆటోతోపాటు ఇమ్రాన్ హుస్సేన్ పాస్‌పోర్టును సీజ్ చేశామన్నారు. అయితే, మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతలను చూసేందుకు నిందితులు ఇద్దరూ మూడు రోజుల క్రితం బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. ఇమ్రన్ హుస్సేన్ తల్లి పాతనగరవాసి, తండ్రి ఒమన్ దేశస్తుడు. ఇతడు తరచూ మేనమామల ఇంటికి వస్తుంటాడని సీఐ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. విలేకర్ల సమావేశంలో ఆమనగల్లు ఎస్ఐ ధర్మేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: విద్యార్థినితో ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన -
అమనగల్లులో విదేశీ యువతి ఆత్మహత్య
సాక్షి, మహబూబ్‌నగర్ : వ్యభిచారం కేసులో పట్టుబడిన ఓ విదేశీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని నెలల క్రితం ఉబ్జెకిస్తాన్‌కు చెందిన వర్ఫాలియా జుళ్ఫియాస్ అనే యువతిని పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సదరు యువతికి కౌన్సిలింగ్ నిర్వహించిన కోర్టు పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించాలంటూ ఆదేశించింది. దీంతో వర్ఫలియాను ఆమనగల్లుకు సమీపంలోని ప్రజ్వల మహిళా పునరావాస కేంద్రంలో ఉంచారు. అయితే శనివారం ఆకస్మికంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. దీనిపై పునరావాస నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. -
ఆమనగల్లు బంద్ విజయవంతం
ఆమనగల్లు: ఆర్డీఓ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వర్తక, వ్యాపార, వృత్తిదారుల సంఘాల జేఏసీ ఆధ్యర్యంలో సోమవారం చేపట్టిన ఆమనగల్లు పట్టణ బంద్ విజయవంతమైంది. పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, పెట్రోలు బంక్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు మూతపడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా చేశారు. తహసీల్దార్ అనితకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, ఆమనగల్లు జెడ్పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు పత్యానాయక్, సింగంపల్లి శ్రీను, వర్తక సంఘ అధ్యక్షుడు కండె పాండురంగయ్య, సభ్యులు కోట తిరుపతయ్య, వీరబొమ్మ రామ్మోహన్, రాజు, వస్త్ర వ్యాపారుల సంఘ సభ్యులు వెంకటేశ్, ఎల్వీఆర్ రాము, శివప్ప, జగదీశ్వర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
25న కేంద్ర మంత్రి హరిబాయ్ చౌదరి పర్యటన
ఆమనగల్లు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిబాయ్ చౌదరి ఈనెల 25న ఆమనగల్లు పట్టణంలో జరుగనున్న బహిరంగసభలో పాల్గొంటారని ఆమనగల్లు జెడ్పీటీసీ సభ్యుడు కండె హరిప్రసాద్ తెలిపారు. మంత్రి పర్యటనపై ఆమనగల్లు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు సభను జరగనీయకుండా అడ్డుకుని సభాసమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీల నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు వివరించడానికి నాగర్‌కర్నూల్ పార్లమెంటు పరిధిలో కేంద్ర మంత్రి హరిబాయ్ చౌదరి పర్యటించనున్నారని ఆయన వివరించారు. మంత్రితోపాటు ఎంపీలు భగవంత్ భరత్, రమేశ్ జిగాజినగి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరు కానున్నారని ఆయన తెలిపారు. సమావేశంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్యానాయక్, వైస్ ఎంపీపీ నిట్టె నారాయణ, మండల బీజేపీ అధ్యక్షుడు నర్సింహ, ఎంపీటీసీ సభ్యులు శ్రీను, వీరయ్య, నాయకులు మోహన్‌రెడ్డి, లక్ష్మణ్, జానయ్య తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ కాకుండానే..
డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. అందుకనుగుణంగా ఎంతో కష్టపడి ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీటు పొందాడు.. నాలుగేళ్లయితే చాలు డాక్టరై పేదలకు సేవ చేయాలనుకున్నాడు.. అంతలోనే ఆ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి.. రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. హృదయ విదారకమైన ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆమనగల్లు / కల్వకుర్తి :జిల్లాలోని గుండ్లపల్లి(డిండి) మండలం చెర్కుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పడమటితండాకు చెందిన రాత్లావత్ రామదాసునాయక్ (24)కు ఇటీవల ఎంసెట్ మెడిసిన్ విభాగంలో ఎస్టీ కోటాలో ఫ్రీ సీటు వచ్చింది. దీంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలోని మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్లు గ్రామపంచాయతీ పరిధిలోని జంగారెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనిం చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సాయికుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదే హంతో గంటపాటు బంధువులు కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో సీఐ భిక్షపతిరావు, ఎస్ఐ వీరబాబు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని డీఎం అజ్మతుల్లా హామీతో వారు శాంతించి వెనుదిరిగారు.