ఆమనగల్లు: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిబాయ్ చౌదరి ఈనెల 25న ఆమనగల్లు పట్టణంలో జరుగనున్న బహిరంగసభలో పాల్గొంటారని ఆమనగల్లు జెడ్పీటీసీ సభ్యుడు కండె హరిప్రసాద్ తెలిపారు. మంత్రి పర్యటనపై ఆమనగల్లు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు సభను జరగనీయకుండా అడ్డుకుని సభాసమయాన్ని వృథా చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీల నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు వివరించడానికి నాగర్‌కర్నూల్ పార్లమెంటు పరిధిలో కేంద్ర మంత్రి హరిబాయ్ చౌదరి పర్యటించనున్నారని ఆయన వివరించారు. మంత్రితోపాటు ఎంపీలు భగవంత్ భరత్, రమేశ్ జిగాజినగి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హాజరు కానున్నారని ఆయన తెలిపారు. సమావేశంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్యానాయక్, వైస్ ఎంపీపీ నిట్టె నారాయణ, మండల బీజేపీ అధ్యక్షుడు నర్సింహ, ఎంపీటీసీ సభ్యులు శ్రీను, వీరయ్య, నాయకులు మోహన్‌రెడ్డి, లక్ష్మణ్, జానయ్య తదితరులు పాల్గొన్నారు.
25న కేంద్ర మంత్రి హరిబాయ్ చౌదరి పర్యటన
Published Sat, Aug 22 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement
Advertisement