
అది తప్పుకాదు: కోదండరామ్
విపక్ష పార్టీలతో జేఏసీ కుమ్మక్కైందన్న అధికారపక్షం వ్యాఖ్యలకు కోదండరామ్ గట్టిగా బదులిచ్చారు.
హైదరాబాద్:
విపక్ష పార్టీలతో జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) కుమ్మక్కైందన్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల వ్యాఖ్యలకు ప్రొఫెసర్ కోదండరామ్ గట్టిగా బదులిచ్చారు. ప్రజా కూటమిగా జేఏసీ.. పలు రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడంలో ఏమాత్రం తప్పులేదని, నిత్యం ఏదో ఒక అంశంపై పార్టీలను కలవక తప్పదని ఆయన అన్నారు.
బాధితుల పక్షాన, వారి గొంతుక వినిపించేందుకు జేఏసీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తే ప్రజలకు నష్టం జరుగుతుందనన్న కోదండరామ్.. అలాంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకించడంతోపాటు విద్యా రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ జనవరి 7 నుంచి 'విద్యా పరిరక్షణ యాత్ర'ను నిర్వహించనున్నట్లు తెలిపారు. (భూ దోపిడీకి చట్టబద్ధతా? ఒప్పుకోం: కోదండరామ్)