సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీని భగ్నం చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని, ఇది సిగ్గుచేటని కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రంలో నియంతృత్వ, అరాచక పాలన సాగుతోం దని బుధవారం విమర్శించింది. తెలంగాణ ఉద్యమానికి మూలమైన ఉద్యోగాల భర్తీ కోసం డిమాండ్ చేస్తున్నవారిని అర్ధరాత్రి పూట అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని భగ్నం చేయడానికి అర్ధరాత్రి పూట జేఏసీ చైర్మన్ కోదండరాం ఇంటి తలుపులను బద్దలుకొట్టి, అరెస్టు చేయడం హేయమని విమర్శించారు.
కోదండరాంను అరెస్టు చేయడం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ వ్యాఖ్యానించారు. ర్యాలీపై సర్కారు వైఖరి నిరంకుశంగా, బ్రిటిష్ పాలనను తలపించేలా ఉందని మండిపడ్డారు. కోదండరాంను అరెస్టు చేయడం కేసీఆర్ ఫ్యూడల్ భావాలకు నిదర్శనమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే రజాకార్లు గుర్తుకొస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు.
ఇంత అరాచకమా: కాంగ్రెస్
Published Thu, Feb 23 2017 1:07 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement