తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని తప్పుడు కేసులు బనాయించి రేవంత్‌రెడ్డిని వేధిస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి తామంతా పూర్తి మద్దతుగా ఉన్నామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై పోలీసులు ఏ మాత్రం ప్రాధాన్యం లేని, చిన్న చిన్న కేసులు పెట్టారన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మరోసారి కలిసి ఎంపీగా రేవంత్ రెడ్డి హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని వివరిస్తానని చెప్పారు. సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసి, మొత్తం వ్యవహారంపై విచారణ జరపమని కోరతామన్నారు. హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి రేవంత్ రెడ్డి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ( బెయిల్ ఇవ్వండి: రేవంత్‌రెడ్డి )
చదవండి : తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
Comments
Please login to add a commentAdd a comment