సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ వేగం పెంచాయి. అభ్యర్థుల ప్రకటన, బహిరంగ సమావేశాలతో ఎన్నికల కదనరంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నాయి.
ఈ క్రమంలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి రేవంత్, ఉత్తమ్ హాజరుకానున్నారు. ఈ భేటీలో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాపై చర్చించే అవకాశం ఉంది. కాగా కాంగ్రెస్ తొలి జాబితాలో తెలంగాణ నుంచి 10 మంది పేర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది.
చదవండి: ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్
Comments
Please login to add a commentAdd a comment