‘జనగామ’ బంద్ విజయవంతం
జనగామ జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన 48 గంటల డివిజన్ బం ద్ ఆదివారం విజయవంతం గా ముగిసింది. బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టా రు.
-
పోలీసుల పహారా.. కొనసాగుతున్న 144 సెక్షన్
-
స్వచ్ఛందంగా సహకరించిన వ్యాపార, వాణిజ్య సంస్థలు
జనగామ : జనగామ జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన 48 గంటల డివిజన్ బం ద్ ఆదివారం విజయవంతం గా ముగిసింది. బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టా రు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో రోడ్లపైకి వచ్చేందుకు కొందరు వెనుకాడారు. అయితే వ్యాపా ర, వాణిజ్య సంస్థలతో పాటు ఇతర ప్రైవేటు కంపెనీలు, చిన్న వ్యాపారులు బంద్‌కు మద్దతుగా ముందుకొచ్చారు. దీంతో నెహ్రూ పార్కు, రైల్వేస్టేçÙన్, హెడ్ పోస్టాఫీసు, కోర్టు ఏరి యా, హన్మకొండ, హైదరాబాద్ జాతీయ రహదారి, సిద్దిపేట రోడ్డు నిర్మానుష్యంగా మారా యి. స్థానిక ఆర్టీసీ చౌరస్తాతో పాటు రైల్వేస్టేçÙన్ ఆవరణలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసి జేఏసీ నాయకుల కదలికలపై నిఘా వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వజ్రా వాహనాన్ని సిద్ధంగా ఉంచడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
నేడు జాతీయ జెండాతో పాటు జనగామ జెండా
పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని జిల్లా రిలే దీక్ష శిబిరం వద్ద జాతీయ జెండాతో పాటు జనగామ జెండాను ఎగుర వేస్తామని జేఏసీ చైర్మెన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.