రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా రాయలసీమ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బుధవారం నుంచి 30వ తేదీ వరకు బంద్
నేటి నుంచి ఆర్‌యూ బంద్
Published Wed, Sep 25 2013 12:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా రాయలసీమ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బుధవారం నుంచి 30వ తేదీ వరకు బంద్ పాటిస్తున్నట్లు వర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు సుబ్బరామయ్య, విజయభాస్కర్‌లు తెలిపారు. మంగళవారం వర్శిటీలో నిర్వహించిన విద్యార్థి జేఏసీ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతాల్లోని 14 విశ్వవిద్యాలయాల జేఏసీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఆయా విశ్వ విద్యాలయాల విద్యార్థి జేఏసీల పిలుపు మేరకు బంద్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో విద్యార్థి నాయకులు లక్ష్మణ్, హమీద్, శంకర్, బసవరాజు, కిరణ్, దస్తగిరి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement