సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న బంద్ | protest in andhra pradesh state reorganisation bill: Seemandhra bandh Continuous | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్రకు మద్దతుగా కొనసాగుతున్న బంద్

Published Fri, Jan 3 2014 9:45 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

protest in andhra pradesh state reorganisation bill: Seemandhra bandh  Continuous

హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. విభజన బిల్లుపై రాష్ట్ర అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపిన విధానాన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా నిరసిస్తోంది. జగన్ పిలుపు మేరకు సమైక్యవాదులు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.పలు వ్యాపార సంస్థలు... స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నాయి.

విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ జరుగుతోంది. గుంటూరు, విశాఖ, కృష్ణ, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. డిపోల నుంచి బస్సులు బయట రావటం లేదు.

మరోవైపు బంద్‌తోపాటు నేటి నుంచి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ పార్టీ శ్రేణులకు, సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. 4న మోటారు సైకిళ్ల ర్యాలీ, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆపార్టీ నిర్ణయించింది. శాసనసభా సమావేశాల్లో జరిగే పరిణామాలను బట్టి ఆ తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనుంది. ఈ నెల ఐదు నుంచి సమైక్య శంఖారావం యాత్రను జగన్‌ పునఃప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లా తంబంళ్లపల్లి నుంచి సమైక్య శంఖారావం ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement