తప్పులు ఎత్తిచూపితే భరించలేరా?
పాలనను గాడిలో పెట్టేందుకే రంగంలోకి దిగిన జేఏసీ
టీటీడీపీ నేతలు ఎల్.రమణ, నామా నాగేశ్వర్‌రావు
వరంగల్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కోసం మేధావులు, ఉద్యమకారుల తో కమిటీలు వేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ విషయూన్ని మరిచిపోవడమే కాకుం డా.. తప్పులు ఎత్తిచూపిన వారిపై భజనపరులతో ఆరోపణలు చేయించడం గర్హనీయమని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణఉద్యమ సమయంలో ఏకాకిగా ఉన్న కేసీఆర్.. రాజకీయ జేఏసీని ఏర్పాటుచేసి చైర్మ న్‌గా కోదండరాంను నియమించినప్పుడు 45 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటిం చామని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ రెండేళ్ల పాలన పై కోదండరాం ప్రశ్నిస్తే ఉలిక్కిపడడం ఎందుకని ప్రశ్నించారు. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన కొండా మురళి వంటి వారిని కౌగి లించుకుంటున్న కేసీఆర్.. ప్రొఫెసర్ కోదండరాంను బొంతపురుగులా చూడటాన్ని ప్రజ లు జీర్ణించుకోలేరన్నారు. కేసీఆర్ తన పాలన ఫాంహౌస్ నుంచే సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
తెలంగాణ బిల్లుతోనే భూసేకరణ చట్టం బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందని, ఆ చట్ట ప్రకారమే సేకరించిన భూములకు నష్ట పరిహా రం చెల్లించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు నామా నాగేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం భూములకు నష్ట పరిహారం చెల్లించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం, గట్టు ప్రసాద్‌బాబు, పుల్లూరు అశోక్‌కుమార్, ఆక రాధాకృష్ణ, మార్గం సారంగం ఉన్నారు.