
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతాం...
నిరుద్యోగులకు జరిగే అన్యాయాలపై శాసనమండలిలో తమ గళం విప్పేందుకు ఎపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రానున్న ...
సుల్తాన్‌బజార్: నిరుద్యోగులకు జరిగే అన్యాయాలపై శాసనమండలిలో తమ గళం విప్పేందుకు ఎపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రానున్న ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతామని ఏపీ నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు లగుడు గోవిందరావు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి తాను, పశ్చిమ రాయలసీమ నుంచి జేఏసీ ప్రధాన కార్యదర్శి తగ్గుపర్తి రామన్న పోటీకి దిగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మంగళవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చనందునే పోటీకి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో తగ్గుపర్తి రమణ, రెడ్డి వరప్రసాద్, అరిగాల రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.