డిగ్రీ అధ్యాపకుల చర్చలు సఫలం
Published Fri, Apr 21 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
– నేటీ నుంచి స్పాట్‌కు హాజరుకానున్న అధ్యాపకులు
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షల స్పాట్‌కు రెమ్యూనరేషన్ పెంచాలని కోరుతూ గత మూడు రోజులుగా స్పాట్ అధ్యాపకులు బహిష్కరించారు. శుక్రవారం ఆర్‌యూ అ«ధికారులు డిగ్రీ కాలేజీ అధ్యాపకుల అసోసియేషన్ జేఏసీ నాయకులతో జరిపిన చర్చలు సఫలమైనట్లు జేఏసీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. రెమ్యూనరేషన్ నాన్ లోకల్ అధ్యాపకులకు రూ. 640 నుంచి 710 రూపాయలకు, లోకల్ వారికి రూ. 550 నుంచి 640కు పెంచేందుకు ఆర్‌యూ అధికారులు అంగీకరించారు. ఇతర డిమాండ్‌పై కూడా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి స్పాట్‌కు హాజరుకానున్నట్లు వారు పేర్కొన్నారు.
Advertisement