కేంద్రం జోక్యం తగదు
Published Fri, Oct 21 2016 11:14 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
తాడితోట (రాజమహేంద్రవరం) :
ముస్లిం పర్సనల్ లా విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం తగదని ముస్లిం జేఏసీ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరంలోని ఆజాద్ చౌక్‌లో ముస్లిం జేఏసీ నాయకుడు ఎండీ హబీబుల్లాఖా¯ŒS ఆధ్వర్యంలో నగరంలోని ముస్లిం మహిళలు, పెద్దలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల నియమాలుప్రవక్త మహ్మద్ కాలం నుంచి అమల్లో ఉన్నాయన్నారు. మూడుసార్లు తలాక్ అన్నంత మాత్రాన విడాకులు అయిపోయినట్టు కాదన్నారు. అయితే ఇస్లాంలో భార్యాభర్తలు విడిపోవడానికి సమాన హక్కు ఇచ్చిందని, పురుషుడు విడిపోతే తలాక్ అంటారని, అదే స్తీ్ర వివాహబంధాల నుంచి తప్పుకుంటే ఖులా అంటారన్నారు. ముస్లిం పర్సనల్ లా విషయంలో కేంద్రం జోక్యం చేసుకోరాదన్నారు. హబీబుల్లా ఖాన్, ముస్తాఫా షరీఫ్ పాల్గొన్నారు.
Advertisement