
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చంచేందుకు ఆర్టీసీ జేఏసీ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ సమావేశంలో తమ భవిషత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన జరిగే.. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని జేఏసీ తెలిపింది. సమ్మెని విరమించి విధుల్లో చేరాలని ఓ వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాత్కలికంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు వాహానాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు పూర్తి కార్యాచరణ రంగం సిద్ధం చేశారు. మరోవైపు డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మెను విరమించేదే లేదని కార్మికులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే జేఏసీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.