జనగామ ఏరియా ఆస్పత్రి ఎదుట నిరసన తెలుపుతున్న వైద్య సిబ్బంది
జనగామ అర్బన్ : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు జిల్లాలోని వైద్య సిబ్బంది చేస్తున్న పెన్‌డౌన్, టూల్ డౌన్ కార్యక్రమం బుధవారం రెండో రోజు కొనసాగింది. ఈమేరకు ఏరియా ఆస్పత్రి, చంపక్ హిల్స్‌లోని ఎంసీహెచ్‌ల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులపాటు ప్రసూతి సెలవులు ఇచ్చి వేతనం చెల్లించాలని కోరారు.
వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు కల్పించి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే, ఎస్‌టీఓ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మయ్య, కార్యదర్శి కె.రాజేష్, సిబ్బంది సంతప్, సహదేవ్, శ్రీరాములు, మధుకర్, రంజిత్, శశిధర్, అభిలాష్, చంద్రారెడ్డి, శ్రీధర్, రమేష్, రమ్య, ఉమాదేవి, శోభ, నాగమణి, వెంకమ్మ, సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment