కష్టాలు కొని తెచ్చుకుంటున్న పవన్‌: జేపీ | Jaya Prakash Narayana, Pawan Kalyan Press Meet | Sakshi
Sakshi News home page

కష్టాలు కొని తెచ్చుకుంటున్న పవన్‌: జేపీ

Published Thu, Feb 8 2018 5:01 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Jaya Prakash Narayana, Pawan Kalyan Press Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న పవన్‌ కళ్యాణ్‌, రాజకీయాల్లోకి వచ్చి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం తనను కలిసిన పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు.

జేపీ ఇంకా ఏమన్నారంటే..
‘ప్రజలకు కావలసినవి రావాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి. ఒకసారి చట్టంలో పెట్టాక ఆశలు ఆకాంక్షలు అమలు చేయకపోవడం ఏరు దాటాక తెప్ప తగలేయడం లాగా ఉంది కేంద్రం పని.  తెలంగాణకు కూడా కొన్ని హామీలు నెరవేర్చాలి. ఆర్థికంగా జరగవలసిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రత్యేక హోదా అనేది నష్టపోయిన ప్రాంతానికి ఆదుకోవడం కోసం మాత్రమే. బుందేల్‌ఖండ్‌కు కేంద్రం నుంచి 4 వేల కోట్లు అందాయి. పదివేల కోట్లు అందాయని కేంద్రం చెబుతుంది. మీ రాజకీయాల కోసం ప్రజలను బలి చేయొద్దు’

పవన్‌ ఏమన్నారంటే..
‘రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. హామీల సాధనకు జేఏసీని ఏర్పాటు చేస్తామని, మీరు కూడా ఉండాలని జేపీని కోరాం. జేఏసీలో రెండు రాష్ట్రాల నాయకులను భాగస్వామ్యం చేస్తాం. ఒక సమూహంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అఖిలపక్ష భేటీ తరువాత ప్రధానమంత్రిని కలిసి అన్నీ వివరిస్తా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement