
జేపీ-పవన్ (పైల్ ఫోటోలు)
సాక్షి, హైదరాబాద్ : జనసేనాని పవన్ కల్యాణ్‌పై మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేఎఫ్‌సీపై (జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి) పవన్ అంతగా శ్రద్ధ చూపించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న మరో కమిటీతో ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు.
‘జేఎఫ్‌సీపై పవన్ మొదట్లో చూపించినంత శ్రద్ధ ఇప్పుడు కనబరటం లేదు. అధ్యయనం, చర్చల చేసి లెక్కలు తీస్తే.. దానిపై ఎలాంటి పురోగతి కనిపించటం లేదు. పవన్ కూడా ఎందుకనో ఆసక్తికనబరచటం లేదు. అందుకే కొత్తగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. జేఎఫ్‌సీ మొదటి దశ అయితే ఇది రెండో దశ. కేంద్రం సమయం కేటాయిస్తే వెళ్లి కలిసి చర్చిస్తాం’ అని జేపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా అసలు తెర పైకి తెచ్చిందే తానని జేపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.