Jaya Prakash narayana
-
జేపీని నమ్మొద్దు.. ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా: పోసాని
సాక్షి, గుంటూరు: జయప్రకాశ్ నారాయణపై ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించటం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు. తమ కులానికి చెందన వాడు కాబట్టే చంద్రబాబుకు జేపీ మద్ధతు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్ధతివ్వడం సిగ్గుచేటు. 2014-2019 మధ్య చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు. చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకున్నారు. వంగవీటి రంగాను చంపిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే. కమ్మకులానికి చెందిన వాడైనా వెధవలకు నేను సపోర్ట్ చేయను. ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది. బాబు మోసాలను గమనించే సీఎం జగన్‌కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు’ అని పోసాని తెలిపారు. -
దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
జయప్రకాష్ నారాయణ.. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. మాజీ ఐఏఎస్ అధికారిగా, లోక్‌సత్తా అనే పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా గెలవకపోయినా.. మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగానే కాదు.. ఏపీ జనాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్ధతు. అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయండి. నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు అయినా రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం’’ : జయప్రకాష్ నారాయణ .. అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు కావొచ్చు. కానీ.. దానికి ఎంచుకున్న సమయం, సందర్భం కూడా చూడాలి కదా. ఇప్పుడు జేపీకి అలియాస్ నాగభైరవ జయప్రకాష్ చౌదరికి కొన్ని ప్రశ్నలు అడుగుదాం. సీఎం జగన్ వచ్చిన తర్వాత పాఠశాలలు బాగుపడ్డాయి, పిల్లల చదువులు బాగున్నాయి, ఆస్పత్రులు బాగున్నాయి, వైద్యం బాగా అందుతోంది, అభివృద్ది పెరిగింది అంటూ ఇన్నాళ్లు మీరు యూట్యూబ్‌లో చేసిన వీడియోలకు మీ మాటలకు పొంతన ఎందుకు కుదరడం లేదు? ►పేదలు బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా? ►పేదపిల్లలు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ప్రజలందరికి కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కాలేజీలు పెట్టటం .. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టటం జెపిగారికి నచ్చటం లేదా? ►పేద ప్రజలకి తలదాచుకునేదుందుకు 30 లక్షల మందికి ఇంటి స్థలాలిచ్చి ఇల్లు కట్టించటం జేపీ గారికి నచ్చటం లేదా? ►గడచిన 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా 950 కిలోమిటర్లు తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయటం .. అందులో భాగంగా ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ కానీ లేదా ఫిషింగ్ హార్బర్ కానీ పెట్టటం జేపీ గారికి నచ్చటం లేదా? ►దక్షిణ భారతదేశం మొత్తానికి మనమే విధ్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరాలనే లక్ష్యంతో అనేకరకమైన విద్యుతు ప్లాంటులు నిర్మించటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఎక్కడా లంచాలకి తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకే ఇవ్వటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఇటుపక్క కాకినాడ సెజ్ అటుపక్క శ్రీసిటీలలో అనేక కొత్త కంపెనీలు రావటం జేపీ గారికి నచ్చటం లేదా? ►ఉద్దానం సమస్యని పరిష్కారించటం నచ్చలేదు .. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టటం జేపీ గారికి నచ్చటం లేదా? ►రాష్ట్ర తలసరి ఆదాయం పెరగటం జేపీ గారికి నచ్చటం లేదా? ►16 లక్షల మంది కొత్తగా టాక్స్ పేయర్లు పెరగటం కూడా జేపీ గారికి నచ్చటం లేదా? ►విద్యా వైద్యంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండటం జేపీ గారికి నచ్చటం లేదా? ►కేంద్ర మరియు ఇతర రాష్ట్రాలతో పోల్చినా లేదా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చినా ప్రతీ రంగంలో మన రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించటం జేపీ గారికి నచ్చటం లేదా? ఇలా ఒకటేమిటి అనేకం .. అసలు రాష్ట్రం బాగుపడటం జేపీ గారికి నచ్చటం లేదా?.. అంతే కాదండోయ్ .. లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు రామోజీ ముఠా మీద కేసులు పెట్టటం జేపీ గారికి అసలే నచ్చటం లేదా? విద్యారంగం వైద్యరంగం విద్యుత్ రంగం లాంటి వన్నీ ఒక్క కులం చేతిలోనే ఉండాలా? .. ముఠాలుగా ఏర్పడి ప్రజలని దోచుకోవాలా? పేద ప్రజలు మీ ఇళ్ల పక్కన ఉండటానికి వీల్లేదా? దోమలమీద యుద్ధం .. పుష్కరాలకు లైట్లు రంగుల పేరుతో రాష్టాన్ని దోచుకోవాలి ... దోచుకున్న డబ్బులతో ఓట్లు కొనాలి .. కేసుల్లేకుండా వ్యవస్థల్ని మానేజ్ చేయాలి .. అప్పుడే మీకు నచ్చుతుందా? అలా చేసే వాళ్ళకే మీరు మద్ధతిస్తారా?.. -
OPS దేశానికి గుది 'బండ'
-
సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా: జేపీ
విశాఖ: విద్యా, వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అభినందించారు. ఏపీలో విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్న జేపీ.. ఇది అభినందనీయమని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ సంకల్పాన్ని అభినందించాలన్నారు. విశాఖలో అందరికీ ఆరోగ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జేపీ మాట్లాడుతూ... ‘విద్యా, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్నా. విద్యా, వైద్య రంగంలో నాడు-నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నా. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్సార్ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్‌ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయం: జేపీ
ఒంగోలు మెట్రో: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయమని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ ప్రశంసించారు. ప్రకాశం జిల్లా నామకరణ స్వర్ణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నపురి తెలుగు అకాడెమీ ఆధ్వర్యంలో డాక్టర్ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువరించిన ‘స్వర్ణ ప్రకాశం’, ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, ‘ఒంగోలు గురించి ఒకింత’ తదితర పుస్తకాల ఆవిష్కరణ సభ శనివారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘స్వర్ణ ప్రకాశం’ పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించి ప్రసంగించారు. కేవలం కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆగిపోకూడదని, అధికార వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు వెలకట్టే సమాజం బాగుపడదని, ఓటుకు, నిరసనకు మధ్య పరిమితమైతే అది బూటకపు ప్రజాస్వామ్యమవుతుందన్నారు. కాగా, ఉన్నం జ్యోతివాసు రచించిన ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, మారేపల్లి సూర్యకుమారి రచించిన ‘ఒంగోలు గురించి ఒకింత’ పుస్తకాలను ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. -
లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ ఆరోగ్య నమూనాలో ఏముందంటే...
సాక్షి, హైదరాబాద్: అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేలా ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్), లోక్‌సత్తా సంయుక్తంగా రూపొందించిన ‘టువర్డ్స్ వయబుల్ యూనివర్సల్ హెల్త్‌కేర్’ ఆరోగ్య నమూనాను లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా.. ► అన్ని రకాల ఔట్ పేషెంట్ సేవలకూ ప్రజలు తమకు నచ్చిన డాక్టర్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, వైద్య సేవల మధ్య పోటీతో ఫ్యామిలీ ఫిజీషియన్ నేతృత్వంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ. ఇది పైస్థాయి ఆస్పత్రి సేవలకు అనుసంధానమై ఉంటుంది. ఆస్పత్రి చికిత్స అవసరమనుకుంటే ఫ్యామిలీ ఫిజీషియనే సిఫార్సు చేస్తారు. ప్రభుత్వం నిధుల్ని సమకూరుస్తుంది. చదవండి: అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్ వేటు ► ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్సల ఆస్పత్రులు ఇన్‌పేషెంట్ సేవలకు మాత్రమే పరిమితం. అయితే అత్యవసరాలు మినహాయించి అన్ని కేసుల్లో కింద స్థాయి వైద్యుని నుండి సిఫార్సు (రెఫరల్) తప్పనిసరి. ► ఆయుష్మాన్ భారత్ నుండి తృతీయ స్థాయి వైద్య సేవలను మినహాయించి, ఆ పథకాలు అన్ని ద్వితీయ స్థాయి చికిత్సలకూ అందరు పౌరులకూ వర్తించేలా వాటి పరిధిని విస్తరించటం. తృతీయ స్థాయిలో నాణ్యమైన, ఖర్చుకు తగ్గ ఫలితాలనిచ్చే వైద్య సేవలందించేలా దేశంలోని జిల్లా, ప్రభుత్వ బోధనాస్పత్రులను అభివృద్ధి చేయటం. అదనపు వనరుల్ని సమకూర్చటం. ►ఈ నమూనాను అమల్లోకి తేవటానికయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరిస్తున్నా, ప్రైవేట్ రంగానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాలు, ఆర్థిక వనరుల సేకరణకు వినూత్న పద్ధతులతో ఈ నమూనా రూపొందింది. ►దేశవ్యాప్తంగా ఈ నమూనా అమలుకు అదనం గా అయ్యే వ్యయం ఏడాదికి సుమారు రూ. 85 వేల కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అదనపు వ్యయం వరుసగా సుమారు రూ.1,900 కోట్లు, రూ. 2,600 కోట్లు ఉంటుంది. ► ఈ సంస్కరణల అమలు ఆవశ్యకతను తెలియచెప్పి ఒప్పించే క్రమంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్, ఆర్థిక సలహా మండలి, పార్లమెంటు సభ్యులు, మీడియా, ఈ రంగంలో పనిచేస్తున్న ఇతర అనేక సంస్థలు, వ్యక్తులు ఇలా సంబంధితుందరికీ ఎఫ్డీఆర్ వివరాలను అందించింది. ► ఆరోగ్య రంగం రాష్ట్రాల జాబితాలోని అంశం కాబట్టి, అంతిమంగా సంస్కరణలు రాష్ట్రాల నుండి ప్రారంభం కావాలి. కాబట్టి ఎఫ్డీఆర్ ఈ నమూనాను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులు, ఇతర సంబంధిత ఉన్నతాధికారులకు పంపింది. ► ఈ సంస్కరణలను అమలు చేసేలా ప్రభుత్వాలను ఒప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషాతో మొదలు పెట్టి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని వ్యక్తిగతంగా కూడా కలవాలని లోక్‌సత్తా, ఎఫ్డీఆర్ భావిస్తోంది. -
ఉత్తుత్తి హామీల్ని నమ్మకండి..
తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఊకదంపుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాయని, వీటిని ప్రజలు ఆమోదించకుండా...స్పష్టమైన ఎజెండాతో ఆయా పార్టీ నేతల నుంచి హామీ తీసుకోవాలని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. ప్రజలకు భద్రత, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ఆదాయం పెంపునకు మార్గాలు చూపే పార్టీలకే ఓటేస్తామని చెప్పాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు డిమాండ్ చేయాల్సిన ఆరు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాటిలో పౌరసేవల చట్టం ఒకటిగా పేర్కొన్నారు. దీన్ని ప్రజల హక్కుగా డిమాండ్ చేయాలన్నారు. ఇక విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని, ప్రతి కుటుంబానికీ ఉచిత వైద్య వసతి కల్పించాలన్నారు. మహిళల భద్రతకు స్థానికంగానే కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రుణమాఫీ వంటి పథకాలను కాకుండా రైతులకు వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం వచ్చేలా చూడాలని జేపీ సూచించారు. గిట్టుబాట ధర కల్పించడం, తక్కువ వడ్డీతో రుణాలివ్వడం, దళారులు లేని మార్కెట్ వ్యవస్థ వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఇక పట్టణాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్ నుంచే తలసరి కేటాయింపులు జరపాలని ఆయన సూచించారు. ఈ అంశాలపైనే ప్రజలు నేతల నుంచి హామీలు పొందాలని జయప్రకాశ్ నారాయణ్ కోరారు. -
లంచం ఇచ్చిన వారికి శిక్ష సబబు కాదు: జేపీ
హన్మకొండ: లంచం ఇచ్చిన వారికి శిక్ష విధించేలా రాజ్యసభలో తీసుకున్న నిర్ణయం మెడ మీద తలకాయ ఉన్నోడు తీసుకునేది కాదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన పౌరులను జ్వాలా అవినీతి వ్యతిరేక పోరాట సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండలో శుక్రవారం అశ్వరథంపై ఊరేగించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేపీ మాట్లాడారు. రాజ్యసభలో ఆమోదం పొందిన అవినీతి నిరోధక సవరణ బిల్లుపై ఆయన స్పందిస్తూ లంచం కావాలని ఎవరూ ఇవ్వరని, సంపన్నులు, పలుకుబడి ఉన్నవారికి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులవుతున్నాయని, పేదలు, సామాన్యులు ఆఫీసుల చూట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. పనుల కోసం లంచాలు ఇచ్చే వారికి శిక్ష విధించడం సరికాదన్నారు. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయి గత్యంతరం లేక లంచం ఇచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పని నిర్ణీత సమయంలోపు చేయని అధికారులు, ఉద్యోగులకు జరిమానాలు విధిస్తే లంచాలు ఇవ్వాల్సిన అవసరం రాదని చెప్పారు. -
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేయాలని, అప్పుడే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధికి అవకాశం ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ‘ఇండియా నెక్ట్స్’సదస్సు శనివారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ఐక్యతను చాటే కొన్ని రాజ్యాంగ సంస్థలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలకలుగా మారాయని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలకు అధికారాలు కల్పించే విషయాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, గతంలో సీఎంలుగా పని చేసేటప్పుడు చేసిన డిమాండ్లను నేడు ప్రధానులుగా తిరస్కరిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నరేంద్ర మోదీ అధికారాల వికేంద్రకరణపై చేసిన డిమాండ్లను ఇప్పుడు ప్రధానిగా ఆయనే తిరస్కరిస్తున్నారని తప్పుపట్టారు. కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి విధానాలను దెబ్బతీస్తూ, కొత్త విధానాలను తమకు నచ్చినట్టుగా పొందుపరుస్తున్నాయని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా... సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వాలు అధికారాలన్నింటినీ తమ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ అన్నారు. గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సొంత మనుషులను రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కూడా కొన్ని అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని మార్చి రాష్ట్రాలకు, జిల్లాలకు, స్థానిక సంస్థలకు నేరుగా అధికారాల వికేంద్రీకరణ చేయాలని ఆయన సూచించారు. జీఎస్టీతో దేశంలో ఒకే పన్ను అమల్లోకి రావడం వల్ల రాష్ట్రాలకు కొంత మేలు జరుగుతోందని, గతంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు 32 శాతం వచ్చే నిధులు ఇప్పుడు 42 శాతానికి పెరిగాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సూర్యారావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే ఇలాంటి సంస్కరణలు ఇంకా రావాల్సి ఉందన్నారు. సదస్సులో ‘ఇండియా నెక్ట్స్’సంస్థ అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం.అమరేంద్ర పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్‌పై జేపీ విమర్శలు
-
పవన్ శ్రద్ధ చూపించట్లేదు : జేపీ
సాక్షి, హైదరాబాద్ : జనసేనాని పవన్ కల్యాణ్‌పై మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేఎఫ్‌సీపై (జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి) పవన్ అంతగా శ్రద్ధ చూపించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న మరో కమిటీతో ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ‘జేఎఫ్‌సీపై పవన్ మొదట్లో చూపించినంత శ్రద్ధ ఇప్పుడు కనబరటం లేదు. అధ్యయనం, చర్చల చేసి లెక్కలు తీస్తే.. దానిపై ఎలాంటి పురోగతి కనిపించటం లేదు. పవన్ కూడా ఎందుకనో ఆసక్తికనబరచటం లేదు. అందుకే కొత్తగా స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. జేఎఫ్సీ మొదటి దశ అయితే ఇది రెండో దశ. కేంద్రం సమయం కేటాయిస్తే వెళ్లి కలిసి చర్చిస్తాం’ అని జేపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా అసలు తెర పైకి తెచ్చిందే తానని జేపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. (కష్టాలు కొని తెచ్చుకుంటున్న పవన్: జేపీ) -
కష్టాలు కొని తెచ్చుకుంటున్న పవన్: జేపీ
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, రాజకీయాల్లోకి వచ్చి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం తనను కలిసిన పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. జేపీ ఇంకా ఏమన్నారంటే.. ‘ప్రజలకు కావలసినవి రావాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి. ఒకసారి చట్టంలో పెట్టాక ఆశలు ఆకాంక్షలు అమలు చేయకపోవడం ఏరు దాటాక తెప్ప తగలేయడం లాగా ఉంది కేంద్రం పని. తెలంగాణకు కూడా కొన్ని హామీలు నెరవేర్చాలి. ఆర్థికంగా జరగవలసిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రత్యేక హోదా అనేది నష్టపోయిన ప్రాంతానికి ఆదుకోవడం కోసం మాత్రమే. బుందేల్‌ఖండ్‌కు కేంద్రం నుంచి 4 వేల కోట్లు అందాయి. పదివేల కోట్లు అందాయని కేంద్రం చెబుతుంది. మీ రాజకీయాల కోసం ప్రజలను బలి చేయొద్దు’ పవన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. హామీల సాధనకు జేఏసీని ఏర్పాటు చేస్తామని, మీరు కూడా ఉండాలని జేపీని కోరాం. జేఏసీలో రెండు రాష్ట్రాల నాయకులను భాగస్వామ్యం చేస్తాం. ఒక సమూహంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అఖిలపక్ష భేటీ తరువాత ప్రధానమంత్రిని కలిసి అన్నీ వివరిస్తా’ -
మన సొమ్ము బయటకు పోకుండా చూడాలి: జేపీ
సాక్షి, హైదరాబాద్ : పనామాలోని మొస్సాక్ ఫోన్సెకా నుంచి బయటపడ్డ నల్లధన ఖాతాలు మచ్చుకు కొన్ని మాత్రమేనని లోక్‌సత్తానేత జయప్రకాష్‌నారాయణ అన్నారు. విదేశాల్లో మూలుగుతున్న భారతీయులకు చెందిన 700 మిలియన్ డాలర్లతో పాటు, మనదేశంలో 20 వేల టన్నుల బంగారం రూపంలో వృథాగా పడి ఉన్న సంపదను సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఆయన సూచించారు. తద్వారా మనకు భారీ మౌలిక సదుపాయాలు, లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. బయటపడ్డ కేసులపై చర్యలు తీసుకుంటూ నల్లధనాన్ని తిరిగి రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఇక మీదట దేశం నుంచి చట్టవిరుద్ధంగా డబ్బు బయటకుపోకుండా వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. -
ఫైనాన్స్ వ్యవస్ధ పై నిఘా వుండాలి
-
శ్వేతపత్రం విడుదల చేయాలి: జేపీ
విజయవాడ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ... సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ‘తెలుగు ప్రజల భవిత కోసం’ అనే నినాదంతో ఆదివారమిక్కడ సంకల్పదీక్ష చేపట్టారు. మౌనదీక్ష ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఒకవైపు చెబుతూనే మరోవైపు దుబారాఖర్చులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పోలవరం ప్రోజెక్టుకు నిర్దేశించిన వ్యయం రూ.16వేల కోట్లకు నెలకు నూటికి రూపాయి వడ్డీ లెక్కగట్టినా రూ.1,900 కోట్లు అవుతుందన్నారు. అటువంటి ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించి నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ నెల 15న హైదరాబాద్‌లో రాజకీయ పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు.ప్రత్యేక హోదా తదితర డిమాండ్లపై రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులు ఈ నెల 16న కనీసం రెండు గంటలపాటు మానవహారాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్షలో లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు శ్రీవాస్తవ, జాతీయ కార్యదర్శి హైమా ప్రవీణ్, రాష్ట్ర అధ్యక్షుడు కామినేని పట్టాభిరామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబ్జి, విజయవాడ నగర అధ్యక్షుడు బి.అశోక్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నగరంలో బహిరంగంగా దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతించపోవడంతో ఐఎంఏ హాలులో జేపీ సంకల్ప దీక్ష చేపట్టారు. -
లోక్‌సత్తాలో కుమ్ములాటలు
దెబ్బతిన్న ఆ పార్టీ వ్యవస్థాపకుడి లక్ష్యం సాక్షి, హైదరాబాద్: వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలైన లోక్‌సత్తా పార్టీ జాతీయ పార్టీగా మారబోయి బొక్కబోర్లా పడింది. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ విజయం నేపథ్యంలో ఇక్కడ ఓటమి పాలైనా ఇతర రాష్ట్రాల్లో అవకాశాలు చూసుకోవాలన్న ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ లక్ష్యం ఆదిలోనే బెడిసికొట్టింది. ఉత్తరాదికి చెందినవారిని పార్టీ జాతీయ అధ్యక్ష పదవిలో ఉంచితే ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరించవచ్చనేది జేపీ ఆలోచన. ఆయన ఆలోచనలకు భిన్నంగా పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల నేతలు లేకుండా ఇతర రాష్ట్రాల నేతల నాయకత్వంలో తాము పనిచేయడం ఏమిటంటూ ఏపీ నేతలు ఎదురుతిరిగారు. ఈ వివా దం ముదిరిపోయి రోడ్డున పడేదాకా వచ్చింది. జేపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతూ జాతీ య కౌన్సిల్ సభ్యులే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. 30 మందిలో ముగ్గురే ఉన్న తెలుగు రాష్ట్రాల నేతల ఆలోచనలకు భిన్నంగా జాతీయ కౌన్సిల్ అధ్యక్షుడిగా మహా రాష్ట్రకు చెందిన సురేంద్ర శ్రీవాత్సవ ఎన్నికయ్యారు. ఆయన్ని నాయకుడిగా అంగీకరించబోమంటూ ఏపీ శాఖ బహిరంగంగా విమర్శలు చేయగా, తెలంగాణ శాఖ అంతర్గత సమావేశాల్లో అసంతృప్తిని వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలో నోటీసులు ఇవ్వకుండానే ఏపీ నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు సురేంద్ర ప్రకటించడంతో వివాదం ముదిరింది. ఈ మొత్తం వ్యవహారంలో జేపీ పూర్తిగా సురేంద్ర శ్రీవాత్సవకు మద్దతు పలుకుతూ వచ్చారు. లోక్‌సత్తాలో కీలకంగా పనిచేసిన కటారి శ్రీనివాసరావు, డీవీవీఎస్ వర్మ వంటి నేతలు పార్టీ నుంచి సస్పెండైన తర్వాత తమదే అసలైన లోక్‌సత్తా పార్టీగా ప్రకటించుకున్నారు. దీంతో త్వరలో జేపీ జిల్లా పర్యటనలు మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. త్వరలో తామూ జిల్లాల్లో పర్యటిస్తామని పోటీ వర్గానికి చెందిన జాతీయ కమిటీ అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు చెప్పారు. -
వ్యవసాయ రుణమాఫీ ఆచరణ సాధ్యం కాదు
లోక్‌సత్తా అధినేత జేపీ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణమాఫీ అనేది ఆచరణ సాధ్యం కాదని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల జీవన విధానం మ రింత గందరగోళం లో పడుతుందని, అంతేగాక వీటికి ఆర్బీఐ కూడా ఒ ప్పుకోదని ఆయన స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని ఇలాంటి హామీల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని జేపీ సూచించారు. అయితే ఇలాంటి హామీలను ప్రకటించే పార్టీల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలే తప్ప.. న్యాయస్థానాలకు వెళ్లినా ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే)ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో జేపీ మాట్లాడారు. రాష్ట్రంలోని కేజీ బేసిన్‌లోని గ్యాస్‌ను ఇక్కడి అవసరాలకు కేటాయించాలని పట్టుబట్టడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను రిలయన్స్ గుజరాత్‌కు తరలించడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. కేజీ బేసిన్ నుంచి వెలికితీసే గ్యాస్‌ను నిలువ చేసేందుకు రాష్ట్రంలో గ్రిడ్స్ లేనందునే రిలయన్స్ గుజరాత్‌కు తరలిస్తోందని, అక్కడ ఏడు గ్రిడ్లు ఉన్నాయని చెప్పారు. ఏపీలో లభించే గ్యాస్‌ను స్థానికంగా ఉపయోగించుకోవడంలో పాలకుల వైఫల్యముందన్నారు. అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న విషయాన్ని విలేకరులు గుర్తుచేయగా.. అయితే బాబు ఒక్కరిదే వైఫల్యం ఉందని తాను చెప్పలేనని జేపీ బదులిచ్చారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో ఓట్లు చీలకూడదన్న భావనతోనే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడానికి, ప్రత్యర్థి పార్టీలపై దుష్ర్పచారం చేయడానికి కొన్ని మీడియా సంస్థలు రూ.300 నుంచి 400 కోట్లదాకా ప్యాకేజీలు వసూలు చేశాయని జేపీ ఆరోపించారు. -
'విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతోంది'
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కేంద్రం శరవేగంగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అయిదు కోట్ల మంది ప్రజలను అడ్డగోలుగా ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఈ చర్య సమైక్య స్పూర్తికి వ్యతిరేకమన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేలా కేంద్రం కసరత్తు చేయాలని జేపీ అన్నారు. సీమాంధ్రవారికి ఇబ్బంది కలగకుండా ఉండేలా బీజేపీ కూడా కృషిచేయాలని ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విజ్ఞప్తి చేశారు. -
ఆర్చిని కూల్చేసిన జేపీ: కేసు నమోదు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓ నిర్మాణ సంస్థ ఆర్చిని కూల్చివేశారనే ఫిర్యాదుపై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ, ఆ పార్టీ నేతలపై కేసు నమో దైంది. పోలీసుల వివరాల మేరకు.. మియాపూర్‌లో ఓ నిర్మాణ సంస్థ ఆర్చిని లోక్‌సత్తా నేతలు ఆదివారం కూల్చివేశారు. దీనికి జేపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. జేపీ స్వయంగా గునపంతో కూల్చివేతను ప్రారంభించారు. అన్ని అనుమతులున్న తమ నిర్మాణాన్ని కూల్చివేశారని, చర్యలు తీసుకోవాలని సదరు నిర్మాణ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఆర్చి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించకపోవడం వల్ల తామే రంగంలోకి దిగామని లోక్‌సత్తా నేతలు చెప్పారు. -
ఆస్తులు, అప్పులెన్నో తేల్చలేం
‘గ్రేటర్’పై ప్రభుత్వం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఏ ప్రాంతానికి ఎన్ని అప్పులు, ఎన్ని ఆస్తులనేది తేల్చలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రాంతాల వారీగా ఆదాయ, వ్యయాలు, రెవెన్యూ లోటు, గ్రేటర్ హైదరాబాద్ ఆదాయ, వ్యయాలు, ఉద్యోగులు, పెన్షనర్ల సమాచారం, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను అందజేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అసెంబ్లీకి అందజేయనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదాయ, వ్యయాలను, రెవెన్యూ లోటును ఇప్పటికిప్పుడు తేల్చడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధాని అయినందున ఇతర ప్రాంతాలకు చెందిన పన్నులను హైదరాబాద్‌లోనే చెల్లిస్తున్నారని, అలాగే హైదరాబాద్ పీఏవో కార్యాలయం నుంచే ఎక్కువ మొత్తంలో పనులకు బిల్లుల చెల్లింపు జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఆదాయం ఎంత, ఎంత వ్యయం అనేది తేల్చలేమని పేర్కొంది. జిల్లా ట్రెజరీల వారీగా ఆదాయం, వ్యయాలను, శాఖల వారీగా ఉద్యోగుల సంఖ్యను, జిల్లాల వారీగా పెన్షనర్ల వివరాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో అన్ని జిల్లాల ట్రెజరీల ద్వారా అన్ని రకాల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.68 వేల కోట్లు. ఇందులో రంగారెడ్డి జిల్లా ట్రెజరీ నుంచి వచ్చిన మొత్తం ఆదాయ వనరులు రూ.28వేల కోట్లు కాగా హైదరాబాద్ (పట్టణ) ట్రెజరీ నుంచి వచ్చిన ఆదాయ వనరులు మొత్తం రూ.27,000 కోట్లు. ప్రస్తుత ఆర్థిక (2013-14) సంవత్సరంలో నవంబర్ వరకు అన్ని జిల్లాల ట్రెజరీల ద్వారా వచ్చిన ఆదాయ వనరులు రూ.46 వేల కోట్లు. ఇందులో అన్ని ట్రెజరీల ద్వారా నవంబర్ వరకు చేసిన వ్యయం రూ.38 వేల కోట్లు. ప్రత్యేకంగా హైదరాబాద్ పీఏవో కార్యాలయం నుంచి నవంబర్ వరకు వివిధ పనులకు ఖర్చు చేసిన నిధులు రూ.11,500 కోట్లు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకు 1,700 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులు తేలింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ప్రస్తుతం మంజూరు చేసి కొనసాగుతున్న ఉద్యోగుల సంఖ్య 10,87,567 మంది. అలాగే అన్ని జిల్లాల్లో కలిపి పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సంఖ్య 5,69,00 కాగా వారికి నెలకు రూ.1,200 కోట్లు పెన్షన్‌గా చెల్లిస్తున్నారు. -
అధికారంలో కొనసాగే అర్హత లేదు
యూపీఏపై జేపీ నిప్పులు సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇక ఒక్కరోజు కూడా కేంద్రంలో కొనసాగే అర్హత కోల్పోయిందని లోక్‌సత్తా పార్టీ వ్యవ స్థాపకుడు జయప్రకాష్ నారాయణ యూపీఏపై నిప్పులు చెరిగారు. ఈ ఓటమిని యూపీఏ ఓటమిగా కాంగ్రెస్ గుర్తించాలన్నారు. ఈ ఫలితాలను సంకేతంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ప్రధాని మన్మోహన్ తన పదవికి రాజీనామా చేసి 3 నెలల ముందే ఎన్నికలను కోరాలన్నారు. పార్టీ నేతలతో కలిసి ఆదివారం జేపీ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కేంద్రం బలవంతంగా పూనుకోవడాన్నే తాను వ్యతిరేకిస్తున్నానని జేపీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అందులో 4 జిల్లాలను వేరుచేసి మరో రాష్ట్రం ఇస్తామంటే అక్కడి వారు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. రాయల తెలంగాణను టీ నేతలు ఎందుకు ఒప్పుకోవట్లేదన్నారు. అవినీతిపై ప్రజల తిరుగుబాటిది: నారాయణ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలపై ప్రజా తిరుగుబాటు ఫలితమే ఆ పార్టీ ఓటమని సీపీఐ నేత నారాయణ అన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే బీజేపీని గెలిపించారని వ్యాఖ్యానించారు. -
సమైక్యాంధ్రకు మద్దతివ్వండి: జయప్రకాశ్ నారాయణ్
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు సంఘీభావం ప్రకటించాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కోరింది. వేదిక సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి, నేతలు ఆతుకూరి ఆంజనేయులు, వి. రామకృష్ణ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం లోక్‌సత్తా కార్యాలయంలో జేపీని గురువారం కలిసింది. ఈ సందర్భంగా సమైక్యాంధ్రప్రదేశ్ ను కొనసాగించాల్సిన ఆవశ్యకతను పరిరక్షణ వేదిక జేపీకి వివరించింది. అనంతరం లక్ష్మణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ అనుమతి, తీర్మానం లేకుండా విభజన సరికాదనే అభిప్రాయాన్ని జేపీ వ్యక్తం చేశారన్నారు. తరువాత జేపీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఢిల్లీ పెద్దలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. తెలుగువారికి సంబంధించిన నిర్ణయం తెలుగునేలపైనే జరగాలన్నారు. సామరస్య, సమగ్ర తెలంగాణ లేదా సమైక్యాంధ్రప్రదేశ్ కావాలన్నారు. సీబీఐ చర్యపై సీవీసీకి లేఖ రాస్తా: జేపీ గనుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌ను నిందితుడిగా సీబీఐ పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాయనున్నట్లు జయప్రకాశ్ నారాయణ్ వెల్లడించారు. లోపభూయిష్టమైన ప్రభుత్వ నిబంధనలను సవరించకుండా వాటికి అనుగుణంగా పనిచేసిన పరేఖ్‌పై కేసు పెట్టడం సరికాదన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జేపీ మీడియాతో మాట్లాడారు. -
బంగారం కొనొద్దు: జయప్రకాష్ నారాయణ
హైదరాబాద్: బంగారం కొనకూడదని ప్రతిఒక్కరూ నిర్ణయం తీసుకోవడం ద్వారా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించగలమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఒకవేళ తప్పనిసరిగా కొనాల్సివస్తే మనం అనుకున్నదాంట్లో 50 శాతం మాత్రమే కొనాలని సూచించారు. మౌలికావసరాలకు ఢోకాలేనివారు తమ ఆదాయం, సమయంలో పది శాతం సమాజానికి కేటాయించాలని కోరారు. మహాత్ముడు పుట్టినరోజు సందర్భంగా ప్రజలు ఈ రెండు ప్రతిజ్ఞలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగారం డిమాండ్‌ను తగ్గించి మనకున్నదాంట్లో పది శాతం సమాజానికిస్తే అందరం అభివృద్ధి చెందుతామని, దేశమూ అభివృద్ధి చెందుతుందన్నా రు. బంగారం దిగుమతిని ఆపితే మనకు కరెంట్ ఖాతా లోటు ఉండదన్నారు. -
సమైక్య 'సెగ’!
కర్నూలు నగరంలో ఏం జరిగింది మంత్రి టీజీ వెంకటేశ్ కాన్వాయ్‌ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన రాజీనామా చేయాలంటూ నినదించారు. కొందరు మంత్రి కారుపై చెప్పులు విసరడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. కారు దిగి మీసం మెలేసి, తొడగొట్టారు. సిసలైన సమైక్యవాదిని తానేనంటూ హెచ్చరించడంతో సమైక్యవాదులు మరింత రెచ్చిపోయారు. టీజీ డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. అంతలోనే టీజీ అనుచరులు కొందరు న్యాయవాదుల దీక్షా శిబిరంపై చెప్పులు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది. కాన్వాయ్‌ని అడ్డుకున్న లాయర్లను అరెస్టు చేయడం మరింత వివాదానికి, రాస్తారోకోకు, ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. చివరికి వారిని పోలీసులు విడిచిపెట్టారు. సోమవారం టీజీ ఇల్లు, కార్యాలయాలను ముట్టడించనున్నట్టు సమైక్యాంధ్ర జేఏసీ ప్రకటించింది అనంతపురంలో ఏం జరిగింది: ‘తెలుగు తేజం’ యాత్రలో భాగంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ భేటీ వివాదాస్పదమైంది. ‘జేపీ గో బ్యాక్’ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. జై సమైక్యాంధ్ర అనాలంటూ జేపీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయన ‘జై తెలుగుతల్లి.. జై సీమాంధ్ర.. జై తెలంగాణ’ అని నినదించినా శాంతించలేదు. వారిపై జేపీ అసహనం వ్యక్తం చేశారు. చివరకు ‘జై ఆంధ్రప్రదేశ్’ అన్నారు. జనం ఉద్వేగంలో ఉన్నారంటూ యాత్రను వాయిదా వేశారు. సాక్షి నెట్వర్క: సీమాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ గట్టిగా తాకుతోంది. వారంతా పార్టీలకు, పదవులకు రాజీనామాలు చేయాలని, సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న కోట్లాది మంది సామాన్యులతో కలిసి నడవాలనే డిమాండ్లు నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ డిమాండ్లతో పలు పార్టీల నాయకులను, మంత్రులను సమైక్యవాదులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆదివారం కర్నూలులో మంత్రి టి.జి.వెంకటేశ్‌ను, అనంతపురంలో లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణను సమైక్యవాదులు అడ్డుకున్నారు. లాయర్ల అరెస్టు.. ఉద్రిక్తత... కర్నూలులో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి టి.జి.వెంకటేశ్ కాన్వాయ్‌ని ఆదివారం సమైక్యవాదులు అడ్డుకుని, రాజీనామా చేయాలంటూ నినదించారు. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంత్రి కారుపై చెప్పులు విసిరారు. దాంతో టీజీ ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. కారు దిగి మీసం మెలేసి, తొడగొట్టారు. అసలు సిసలైన సమైక్యవాదిని తానేనంటూ ఆందోళనకారులను హెచ్చరించారు. దాంతో వారు మరింత రెచ్చిపోయారు. ‘మంత్రి టీజీ డౌన్... డౌన్...’, ‘గో బ్యాక్ టీజీ...’, ‘మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. ఆందోళనకారులను పక్కకు నెట్టి మంత్రి కాన్వాయ్‌ని అక్కడినుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అంతలోనే టీజీ అనుచరులు కొందరు న్యాయవాదుల దీక్షా శిబిరంపై చెప్పులు విసరడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అందరినీ చెదరగొట్టి మంత్రి కాన్వాయ్‌ని పంపించేశారు. అనంతరం కాన్వాయ్‌ని అడ్డుకున్న న్యాయవాదులను అరెస్టు చేసి నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమైక్యవాదుల అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వందలాదిగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా వచ్చి సమైక్యవాదులకు మద్దతు ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. సమస్య తీవ్రరూపం దాల్చడంతో అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేస్తున్నట్టు సీఐ ప్రకటించారు. ఆందోళనకారులు శాంతించారు. టీజీ వైఖరికి నిరసనగా సోమవారం అయన ఇల్లు, కార్యాలయాలను ముట్టడించనున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు చెన్నయ్య తెలిపారు. ఎస్వీ మోహన్‌రెడ్డిపై కేసు నమోదు వైఎస్సార్సీపీ నేత ఎస్.వి.మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో సమైక్య జేఏసీ నాయకులు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని దాడికి యత్నించారని టీజీ కారు డ్రైవర్ ఖాజా హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్వీతో పాటు మరికొంతమంది దాడికి ప్రోత్సహించారనే ఫిర్యాదుపై ఐపీసీ 341, 520, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ సీఐ అబ్దుల్ గౌస్ తెలిపారు. అనంతపురంలో జేపీకి సమైక్య సెగ ఇక జయప్రకాశ్ నారాయణకు అనంతపురంలో ‘సమైక్య’ సెగ తగిలింది. ‘తెలుగు తేజం’ పేరుతో ఆయన చేపట్టిన యాత్రలో భాగంగా ఉదయం 10 గంటలకు రామ్‌నరేశ్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకే అక్కడకు చేరుకున్న ఆందోళనకారులు ‘జేపీ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. జై సమైక్యాంధ్ర అనే వరకూ లోపలికి వెళ్లనీయబోమంటూ హాల్ ఎదుటే బైఠాయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారితో జరిగిన తోపులాటలో పలువురు సమైక్యవాదులు స్వల్పంగా గాయపడ్డారు. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య జేపీ ఫంక్షన్ హాల్లోకి వెళ్లారు. ఆయన ప్రసంగిస్తుండగా సమైక్యవాదులు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకెళ్లారు. జై సమైక్యాంధ్ర అని నినదించే వరకూ ప్రసంగించేందుకు వీల్లేదంటూ అడ్డుకున్నారు. దాంతో లోక్‌సత్తా నేతలు, సమైక్యవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. ‘జై తెలుగుతల్లి.. జై సీమాంధ్ర.. జై తెలంగాణ’ అని జేపీ నినాదాలు చేసినా, ‘జై సమైక్యాంధ్ర’ అనాల్సిందేనని సమైక్యవాదులు పట్టుబట్టారు. జాతి ప్రయోజనాల కోసం ప్రజలను జాగృతం చేసేందుకు వస్తే ఇలాగేనా వ్యవహరించేదంటూ వారిపై జేపీ అసహనం వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటలు హైడ్రామా సాగింది. రాష్ట్రం ముక్కలై సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిసి కూడా సమైక్యాంధ్ర కోసం ఎందుకు పాటుపడటం లేదంటూ జేఏసీల నాయకులు జేపీని నిలదీశారు. చివరకు ఆయన ‘జై ఆంధ్రప్రదేశ్’ అనడంతో శాంతించారు. పజలు ఉద్వేగంలో ఉన్న ఇలాంటి తరుణంలో యాత్ర నిర్వహించినా లాభముండదని జేపీ అన్నారు. పోలీసుల అనుమతి కూడా రద్దయినందున దాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలన్న చందంగా ప్రజాప్రయోజనాలపై పోరాడే నాయకుడికే ఆటంకాలు ఎదురవుతాయన్నారు. జై సమైక్యాంధ్ర అని నినదించాలంటూ శనివారం కర్నూలులో కూడా జేపీని సమైక్యవాదులు అడ్డుకోవడం తెలిసిందే. పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలనే డిమాండ్‌తో మంత్రులు కిల్లి కృపారాణి, శత్రుచర్ల విజయరామరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, రాయపాటి సాంబశివరావు తదితరులను సమైక్యవాదులు కొద్ది రోజులుగా పదేపదే అడ్డుకుంటూ వస్తున్నారు. -
ఢిల్లీ పర్యటన వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి బాబు?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన వెనకు ఉన్న ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు తెలపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఆయన తెలుగుతేజం పేరిట యాత్ర చేపట్టారన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాని ఈటెల రాజేంద్ర హితవు పలికారు. -
'రాష్ట్రాలు ఎన్నిఉన్నా సమైక్యత ముఖ్యం'
హైదరాబాద్ : రాష్ట్రాలు ఎన్ని ఉన్నా సమైక్యత ముఖ్యమని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. లోక్‌సత్తా పార్టీ శనివారం హైదరాబాద్ జూబ్లీహాల్లో 26అంశాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయని తెలుగు ప్రజలకు నమ్మకం కల్పించాలని అన్నారు. గతాన్ని తవ్వకుండా భవిష్యత్ గురించి ఆలోచిద్దామని ఆయన పేర్కొన్నారు. ఆవేశాలు, వాదనలు లేకుండా అర్థవంతమైన చర్చలు జరపాలని ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారికి విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య విభేదాలు లేకుండా చేయాలన్నదే తమ ఉద్దేశ్యమని జయప్రకాష్ నారాయణ తెలిపారు. హైదరాబాద్ గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.