
మన సొమ్ము బయటకు పోకుండా చూడాలి: జేపీ
సాక్షి, హైదరాబాద్ : పనామాలోని మొస్సాక్ ఫోన్సెకా నుంచి బయటపడ్డ నల్లధన ఖాతాలు మచ్చుకు కొన్ని మాత్రమేనని లోక్‌సత్తానేత జయప్రకాష్‌నారాయణ అన్నారు. విదేశాల్లో మూలుగుతున్న భారతీయులకు చెందిన 700 మిలియన్ డాలర్లతో పాటు, మనదేశంలో 20 వేల టన్నుల బంగారం రూపంలో వృథాగా పడి ఉన్న సంపదను సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం ఆయన సూచించారు.
తద్వారా మనకు భారీ మౌలిక సదుపాయాలు, లక్షలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. బయటపడ్డ కేసులపై చర్యలు తీసుకుంటూ నల్లధనాన్ని తిరిగి రప్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఇక మీదట దేశం నుంచి చట్టవిరుద్ధంగా డబ్బు బయటకుపోకుండా వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.