ఆర్చిని కూల్చేసిన జేపీ: కేసు నమోదు | case filed aginst jp | Sakshi
Sakshi News home page

ఆర్చిని కూల్చేసిన జేపీ: కేసు నమోదు

Published Mon, Jan 13 2014 12:59 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆర్చిని కూల్చేసిన జేపీ: కేసు నమోదు - Sakshi

ఆర్చిని కూల్చేసిన జేపీ: కేసు నమోదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఓ నిర్మాణ సంస్థ ఆర్చిని కూల్చివేశారనే ఫిర్యాదుపై లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ, ఆ పార్టీ నేతలపై  కేసు నమో దైంది. పోలీసుల వివరాల మేరకు.. మియాపూర్‌లో ఓ నిర్మాణ సంస్థ ఆర్చిని లోక్‌సత్తా నేతలు ఆదివారం కూల్చివేశారు. దీనికి జేపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. జేపీ స్వయంగా గునపంతో కూల్చివేతను ప్రారంభించారు.
 
  అన్ని అనుమతులున్న తమ నిర్మాణాన్ని కూల్చివేశారని, చర్యలు తీసుకోవాలని సదరు నిర్మాణ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఆర్చి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించకపోవడం వల్ల తామే రంగంలోకి దిగామని లోక్‌సత్తా నేతలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement